ఈ పొడిని త‌ల‌కు రాశారంటే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్న మాయం అవుతుంది.. తెలుసా?

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎంతో మందిని స‌ర్వ‌సాధార‌ణంగా వేధించే స‌మ‌స్య‌ల్లో చుండ్రు( Dandruff ) ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.చుండ్రు కార‌ణంగా తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌వుతుంటారు.

 This Nutmeg Hair Mask Help To Get Rid Of Dandruff Quickly Details, Nutmeg Hair-TeluguStop.com

చుండ్రు వ‌ల్ల తీవ్ర‌మైన దుర‌ద‌, జుట్టు అధిక‌రంగా ఊడిపోవ‌డం, కురులు డ్రై అవ్వ‌డం వంటి స‌మ‌స్యలు కూడా త‌లెత్తుతాయి.అందుకే చుండ్రును ఎలాగైనా వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే ఇలాంటి వారికి జాజికాయ పొడి( Nutmeg ) చాలా ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌సాలా దినుసుల్లో ఒక‌టైన జాజికాయ ఆరోగ్య ప‌రంగానే కాకుండా జుట్టు స‌మ‌ర‌క్ష‌ణ‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా జాజికాయ పొడిని ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా త‌ల‌కు రాశారంటే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్న మాయం అవ్వాల్సిందే.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు జాజికాయ పొడి వేసుకోవాలి.

అలాగే వ‌న్ టేబుల్ స్పూన్ ఆలోవెర జెల్‌,( Aloevera Gel ) రెండు టేబుల్ స్పూన్లు గ‌డ్డ పెరుగు మ‌రియు వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Remedy, Latest, Nutmeg, Nutme

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని స్కాల్ప్ కు( Scalp ) అప్లై చేసి అర‌గంట పాటు ఉంచుకోవాలి.అర గంట అనంత‌రం తేలిక‌పాటి షాంపూను ఉప‌యోగించి శుభ్రంగా త‌ల‌స్నానం చేయాలి.వారానికి ఒక‌సారి ఇలా చేయ‌డం వ‌ల్ల అద్భుత ఫ‌లితాలు పొందుతారు.

జాజికాయలో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి-6, ఐరన్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి.ఇవి జుట్టును మూలాల నుండి బ‌లోపేతం చేస్తాయి.

తలకు రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Remedy, Latest, Nutmeg, Nutme

అలాగే జాజికాయ తలపై పేరుకున్న మలినాలను తొలగిస్తుంది.తలపై ఉండే సహజ నూనెల స్థాయిని సమతుల్యం చేస్తుంది.ఎగ్జిమా, ఫంగస్, చుండ్రు మొదలైన స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను స‌మ‌ర్థ‌వంతంగా దూరం చేస్తుంది.

చుండ్రు పెరుగుదలకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా జాజికాయ‌ పనిచేస్తుంది.భవిష్యత్తులో చుండ్రు మ‌ళ్లీ మీ ద‌రిచేర‌కుండా సైతం ర‌క్షిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube