వేసవి కాలంలో మామిడి పండ్లను తింటే.. వచ్చే మొటిమలను నివారించడానికి ఈ టిప్స్ మీకోసమే..!

వేసవికాలంలో( Summer ) మామిడికాయ పండ్లు( Mangoes ) అధికంగా దొరుకుతాయి.వేసవికాలంలో దొరికే మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు కూడా ఉండరు.

 How To Treat Pimples After Eating Mangoes In Summer Details, Pimples, Mangoes, S-TeluguStop.com

మార్కెట్లో వచ్చినంత కాలం వీటిని తిని ఆస్వాదిస్తారు.అయితే ఈ విధంగా ఇష్టంగా తింటున్న మామిడి పండ్లతో మనకు చిన్న చిన్న సమస్యలు తప్పవు.

మామిడి పండ్లను వేసవి కాలంలో తింటే కొందరిలో మొటిమల సమస్య( Pimples ) కనిపిస్తుంది.అయితే ఇవి ఎందుకు వస్తాయి? ఈ మొటిమలను నివారించడానికి కొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Diabetes, Mangoes, Tips, Insulin, Mangoes Pimples, Pimples, Sabja Seeds,

మామిడి పండ్లను తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.మన శరీరంలో ఇన్సులిన్ స్పైక్లను కలిగిస్తాయి.ఎందుకంటే ఇది సెబమ్ స్రావాన్ని పెంచడం వలన మన శరీరంలోని నూనె గ్రంధులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.ఈ కారణంగానే మొటిమల సమస్య వస్తుంది.అయితే వీటిని నివారించడానికి ఈ చిట్కాలు పాటించాలి.మామిడిపండు తినే ముందు వాటిని రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టాలి.

ఇలా నానబెట్టడం వలన అందులో ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.కొన్ని గంటల పాటు నీటిలో నానపెట్టినప్పుడు శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అదనపు ఫైటిక్ తొలగిపోతుంది.

అలాగే పోషకాలను బాగా గ్రహించేలా చేస్తుంది.

Telugu Diabetes, Mangoes, Tips, Insulin, Mangoes Pimples, Pimples, Sabja Seeds,

ఇలా నానబెట్టి తినడం వలన మొటిమలు, చర్మ సమస్యలు, తలనొప్పి, మలబద్ధకం ఇతర సమస్యలు నివారించడంలో ఉపయోగపడుతుంది.ఇక ఎప్పుడూ కూడా మామిడిని ఒక పండులానే తినాలి.భోజనంతో కలిపి అస్సలు తినకూడదు.

భోజనంతో కలపడం వలన మొటిమలు ఇతర చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.అందుకే భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత మామిడి పండును తినడం మంచిది.

అలాగే మామిడిపండుతో ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకోవడం కూడా శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తాయి.దీంతో మొటిమలు నివారించడంలో సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube