కరోనా వైరస్ దేశం మొత్తం ఏవిధంగా వ్యాపిస్తుందో మనకు తెలిసిందే.ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని ప్రభుత్వాలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి.
అంతే కాకుండా మరో వైపు అన్ని ఫార్మా కంపెనీలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు కరోనా వాక్సిన్ కనుగొనడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.రోజు రోజుకి కేసులు పెరుగుతుండటంతో,మరణాల రేటు తక్కువగా ఉండి, అధిక రికవరీ రేటు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మేర ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అయితే ఈ మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసేందుకు వాక్సిన్ కనుగొనే వేటలో శాస్త్రవేత్తలు పడ్డారు.

ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ను రెండు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.ఈ రెండు దశలలో విజయవంతం అయినప్పటికీ చివరి ప్రయత్నంగా మూడవ దశలో ప్రయోగించనున్నారు.అయితే కొన్ని రకాల కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు వాలంటీర్లకు ఇవ్వడం ద్వారా వారిలో కొన్ని చర్మ సమస్యలు ఏర్పడినట్లు భావించారు.
అయితే ముందుగా ఈ వ్యాక్సిన్ ను వివిధ వయసుల వారికి ఇవ్వనున్నారు.
ఎవరైతే మద్యపానం సేవిస్తున్నారో అలాంటి వారికి కరోనా వ్యాక్సిన్ విషయంలో ఓ చేదు వార్తను వినాల్సి వస్తుంది.
స్పుత్నిక్ వి కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రభావవంతం కావడానికి దాదాపు 42 రోజులు పడుతుంది.కాబట్టి ఈ నలభై రెండు రోజులలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాదాపు రెండు నెలల పాటు మద్యం సేవించకూడదని రష్యా ఉప ప్రధాని టటియానా గోలికోవా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.అయితే ఈ వార్త నిజంగానే మందుబాబులకు ఎంతో చేదు వార్త అని చెప్పవచ్చు.
మందు లేనిదే ముద్ద దిగని మందుబాబులకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాదాపు రెండు నెలలపాటు మద్యం సేవించకూడదంటే మందు ప్రియులకు ఇది మింగుడుపడని విషయం అని చెప్పవచ్చు.