వెల్లుల్లి( garlic ) ఆరోగ్యానికి చాలా మంచిది.దీంతో వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
దీన్ని తింటే ఎక్కువ కాలం కూడా బ్రతుకుతారని ఆరోగ్య నిపుణులు( Health professionals ) చెబుతున్నారు.ఇది ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా చెక్ పెడుతుంది.
ఇక అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.ముఖ్యంగా చలికాలంలో వెల్లుల్లితో వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి.
వెల్లుల్లి ఎన్నో వ్యాధులు దరిచేరకుండా చూస్తుంది.అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఇక ఈ సీజన్లో వెల్లుల్లి తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది.గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
ఇక స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులు రావడాన్ని కూడా తగ్గిస్తుంది.
ఇక గుండెపోటు, స్ట్రోక్( Heart attack, stroke ) లాంటి ప్రాణాంతక వ్యాధులు రావడానికి ముఖ్య కారణం అధిక రక్తపోటు అని చెప్పవచ్చు.కాబట్టి వెల్లుల్లి తింటే రక్తపోటును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.దీనిలో బరువు తగ్గించే సమ్మేళనం ఉంటాయి.
వెల్లుల్లి తినడం వలన శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది.వెల్లుల్లిలో యాంటీ హైపర్లిపీడేమియా ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.శీతాకాలం లో దగ్గు, జలుబు , నీరసం, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి.
కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాలి.ఇది వైరస్, బ్యాక్టీరియా( Virus, bacteria ) నుండి కాపాడుతుంది.కాబట్టి శీతాకాలం కాల్చిన వెల్లుల్లి తింటే రోగనిరోధక శక్తి లభిస్తుంది.అయితే వెల్లుల్లిని పొట్టుతో కాల్చకుండా పొట్టు తీసి దానిపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను పోసి, ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి కలపాలి.
ఇక తక్కువ మంట మీద డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒకటి నుండి రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే సరిపోతుంది.ఇలా తరచుగా తినడం వలన ఎక్కువ కాలం బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది.