Turmeric almond drink : చ‌ల‌కాలంలో రోగాల‌కు దూరంగా ఉండాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే!

చలికాలం అంటేనే రోగాల పుట్ట.ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఈ సీజన్ లోనే అధికంగా వేధిస్తుంటాయి.

 Drink This Drink To Stay Away From Diseases In Winter, Turmeric Almond Drink, Wi-TeluguStop.com

చలికాలంలో రోగ నిరోధక వ్యవస్థ సహజంగానే బలహీన పడుతుంది.దాంతో ఆయా సమస్యలు తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.

అయితే చలికాలంలో రోగాలకు దూరంగా ఉండాలనుకుంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకోవాల్సిందే.

ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

దీంతో వివిధ రోగాలు దరిదాపుల్లోకి రావాలంటే భయపడతాయి.మరి ఇంతకీ చలికాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించే ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌దిహేను రాత్రంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులను వేసుకోవాలి.

అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్‌ యాలకుల పొడి, చిటికెడు మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము, చిటికెడు కుంకుమ పువ్వు, ఒక కప్పు వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాసు వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై రెండు నిమిషాల పాటు హీట్ చేయాలి.

Telugu Tips, Latest, Turmeric Almond, Diseases-Telugu Health Tips

అనంతరం సర్వ్ చేసుకుంటే మన టర్మరిక్ ఆల్మండ్ డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ డ్రింక్ ను రోజు ఉదయాన్నే తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.దీంతో జలుబు, దగ్గు, జ్వరం త‌దిత‌ర సీజ‌న‌ల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.ఒకవేళ ఈ సమస్యలు ఉన్నా.వాటి నుంచి త్వరగా బయటపడేందుకు ఈ డ్రింక్ సహాయపడుతుంది.అలాగే ఈ టర్మరిక్ ఆల్మండ్‌ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

మెదడు పనితీరు రెట్టింపు అవుతుంది.మరియు చెడు కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్యంగా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube