ఎండల ప్రభావం, హార్మోన్ చేంజ్, ప్రెగ్నెన్సీ, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి తదితర కారణాల వల్ల కొందరికి మెడ నల్లగా మారిపోతూ ఉంటుంది.డార్క్ నెక్ కారణంగా చాలా మంది బాధపడుతూ ఉంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీ మీకు ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటించడం ద్వారా సులభంగా మరియు వేగంగా డార్క్ నెక్( Dark neck) కి బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు బాదం గింజలను( Almonds ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బాదం మరియు బియ్యం పొడిలో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు ( Curd )మరియు నాలుగైదు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బంగాళదుంప జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.తదనంతరం వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
వారానికి మూడు సార్లు ఈ రెమెడీని ప్రయత్నించాలి.
బాదం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.ముఖ్యంగా స్కిన్ వైట్నింగ్ కి మద్దతు ఇస్తుంది.మెడ నలుపును పోగొడుతుంది.
అలాగే బంగాళదుంప జ్యూస్, నిమ్మరసం నెక్ డార్క్ నెస్ ను వేగంగా తొలగిస్తాయి.మెడను తెల్లగా మారుస్తాయి.
బియ్యం పిండి మెడపై పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.పెరుగు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
మెడ అందంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.