స్ట్రైట్ స్మూత్ అండ్ షైనీ హెయిర్ చూసేందుకు ఎంత ఆకర్షణీయంగా మరియు అందంగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అందుకే అలాంటి హెయిర్ కోసం చాలా మంది అమ్మాయిలు తెగ ఆరాటపడుతుంటారు.
ఈ క్రమంలోనే ఏవేవో జుట్టు ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.తరచూ హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను యూస్ చేస్తారు.
అలాగే జుట్టుకు రకరకాల ట్రీట్మెంట్స్ సైతం చేయించుకుంటారు.కానీ, ఇంట్లోనే చాలా సులభంగా స్ట్రైట్ స్మూత్ అండ్ షైనీ హెయిర్ ను పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ రైస్ వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
నీరు మొత్తం దగ్గర పడిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఉడికించిన వాటిని చల్లార బెట్టుకోవాలి.ఆపై మిక్సీ జార్ లో ఉడికించి చల్లారినబెట్టుకున్న బ్రౌన్ రైస్, అవిసె గింజలు, చియా సీడ్స్ ను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్మూత్ క్రీమ్ ను స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని రెండు గంటల పాటు షవర్ క్యాప్ ధరించాలి.అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే సహజంగానే స్ట్రైట్ స్మూత్ అండ్ షైనీ హెయిర్ ను తమ సొంతం చేసుకోవచ్చు.