బెల్లం, నెయ్యి.ఈ రెండు ఆహార పదార్థాలు ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలను చేకూరుస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.బెల్లం మరియు నెయ్యిలో లెక్కలేనన్ని పోషకాలు నిండి ఉంటాయి.అందుకే వీటిని విడివిడిగా అప్పుడప్పుడు తీసుకుంటూనే ఉంటాం.కానీ భోజనం చేసిన తర్వాత బెల్లం, నెయ్యి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.సాధారణంగా భోజనం చేసిన తర్వాత చాలా మందికి స్వీట్ క్రేవింగ్స్ అధికంగా ఉంటాయి.
దాంతో స్వీట్స్ ను లాగించేస్తుంటారు.ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి.
అయితే భోజనం తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిలో వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కలిపి తీసుకుంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండవు.పైగా బెల్లం నెయ్యిలో ఉండే పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి అద్భుతంగా తోడ్పడతాయి.
అలాగే భోజనం తర్వాత బెల్లం, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్( Gas Problem ), మలబద్ధకం వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.బెల్లం, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల మెటబాలిజం( Metabolism ) రేటు పెరుగుతుంది.దాంతో క్యాలరీలు వేగంగా కరుగుతాయి.వెయిట్ లాస్ అవుతారు.
అంతేకాదు భోజనం చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిలో వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టం(Immune System ) స్ట్రాంగ్ గా తయారవుతుంది.జలుబు, దగ్గు వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.ఇక బెల్లంలో ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనతను తరిమి కొడుతుంది.
నెయ్యిలో ఉండే ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు ఎముకలను బలంగా మారుస్తాయి.చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తాయి.
కాబట్టి భోజనం చేసిన తర్వాత ఏవేవో స్వీట్స్ తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు ఆరోగ్యానికి మేలు చేసి బెల్లం, నెయ్యి కలిపి తీసుకోండి.