మామూలుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యి థియేటర్లలో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో సక్సెస్ అవుతూ ఉంటాయి.ఇప్పటికే అలా సక్సెస్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
థియేటర్లలో ఫ్లాప్ అవుతుంటాయి.ఆ తర్వాత అవే క్లాసిక్స్ అవుతాయి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే అని చెప్పాలి.సినిమా మరేదో కాదు సూర్యవంశం.
( Sooryavansham ) హిందీలో ఈవీవీ సత్యనారాయణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) నటించారు.సౌందర్య( Soundarya ) హీరోయిన్ గా నటించింది.
జయసుధ, రచన వంటి వారు కీలక పాత్రల్లో పోషించారు.

అయితే థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయిన ఈ మూవీ ఆ తర్వాత కల్ట్ స్టేటస్ అందుకుంది.మరీ ముఖ్యంగా టీవీల్లో ఈ సినిమాకు అంతులేని ఆదరణ లభించింది.విడుదలై పాతికేళ్లు దాటినా ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.
అయితే కేవలం టీవీలలో మాత్రమే కాదు, యూట్యూబ్ లో కూడా ఇది పెద్ద హిట్.గోల్డ్ మైన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను 3 యూట్యూబ్ ఛానెళ్లలో అప్ లోడ్ చేస్తే, మొత్తంగా 701 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది.

తెలుగులో మాత్రం సూర్యవంశం అన్ని ఫార్మాట్లలో హిట్టయింది.థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమా, బుల్లితెరపై ఇప్పటికీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.అలా సౌందర్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ యూట్యూబ్లో రికార్డును సృష్టించింది.ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో ప్రసారం అయితే అతుక్కుపోయి చూసే వారు చాలామంది ఉన్నారు.
ఈ సినిమా విడుదల అయి దాదాపుగా పాతికేళ్లు పూర్తి అయ్యింది.అయితే ఇలాంటి సినిమానే తెలుగులో మరొక సినిమా కూడా ఉంది.
అదే మహేష్ బాబు నటించిన అతడు సినిమా.