ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి కానీ.లాక్ డౌన్ తర్వాత సినిమా పరిశ్రమ ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది.
అదే సమయంలో టీవీరంగం ఫీనిక్స్ పక్షిలా ఎగిరింది.లాక్ డౌన్ వేళ జనాలంతా టీవీలకే అతుక్కుపోయారు.
అంతేకాదు.గత కొంతకాలంగా బుల్లితెరపై ఆయా ఛానెళ్లు చేస్తున్న స్పెషల్ కార్యక్రమాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆయా అకేషన్స్ ను బట్టి.ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ.
ప్రేక్షకులను తమవైపు లాక్కుంటున్నాయి.మిగతా చానెల్స్ తో పోల్చితే ఈటీవీ ఈ విషయంలో మరీ ముందు వరుసలో ఉంది.
ఈటీవీలో ప్రసారం అయ్యే ప్రతి ప్రోగ్రాం జనాలకు విపరీతమైన ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంది.పండగలతో పాటు ఆయా డేస్ ను పురస్కరించుకుని ధూంధాం కార్యక్రమాలను రూపొందిస్తుంది ఈటీవీ.
తాజాగా ఈటీవీ మరో పంగను ప్రత్యేకంగా జనాల ముందుకు తీసుకొస్తుంది.అతికొద్ది రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. ఈ గణపతి వేడుకలను మరితం కలర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతుంది ఈటీవీ.ఊరిలో వినాయకుడు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
ఇప్పటికే ఈ షోకు సంబంధించి పలు ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి.ఆయా ప్రోమోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అంతేకాదు.సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా.
తాజాగా రిలీజ్ అయిన మూడో వీడియో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది.జనాల్లో కొత్త జోష్ నింపుతోంది.
ఊరిలో వినాయకుడు పేరుతో విడుదల అయిన ప్రోమోల్లో రెండు టీంలకు రోజా, ఇంద్రజ లీడర్లుగా ఉన్నారు.అటు కొంత మంది ఇటు కొంత మంది పార్టిసిపెంట్లు ఉన్నారు.కాగా ఈ కార్యక్రమానికి హీరో శ్రీకాంత్ స్పెషల్ గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు.అతడు స్టేజి మీదకు అడుగు పెట్టగానే.ఇద్దరు లీడర్లైన రోజా, ఇంద్రజ ఒక్కసారిగా స్టేజి మీదకు వెళ్తారు.ఇద్దరూ శ్రీకాంత్ ను చెరోవైపు లాగుతూ తమ టీంలోకి రావాలంటే.
తమ టీంలోకి రావాలంటూ లాక్కుంటారు.ప్రస్తుతం ఈ ప్రోమో జనాల్లోకి బాగా వెళ్లింది.
అటు సామాజిక మాధ్యమాల్లోనూ బాగా వైరల్ అవుతోంది.