రామ్ చరణ్ , బుచ్చిబాబు( Ram Charan, Buchi Babu ) కాంబినేషన్ లో వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ ( Kajal Aggarwal Special Song )చేయనుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
గతంలో కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.చరణ్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలు ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 2026 సంవత్సరం మార్చి నెల 27వ తేదీన విడుదల కానుంది.ఆ సమయానికి ఇప్పటికే ది ప్యారడైజ్ సినిమా ( The Paradise movie )ఫిక్స్ అయింది.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే కేవలం ఒక సినిమా మాత్రమే పైచేయి సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.చరణ్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి.

రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్( 80 crore rupees range ) లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.పెద్ది సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.ఈ సినిమాలోని పాత్ర జాన్వీకి కెరీర్ స్పెషల్ రోల్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రామ్ చరణ్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారు.స్టార్ హీరో రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ రికార్డులను క్రియేట్ చేస్తారేమో చూడాలి.







