ఎంత అందమైన డ్రెస్ వేసుకున్న మోచేతులు నల్లగా ఉంటే మాత్రం చాలా బాధపడుతూ ఉంటాం.అలాగే లేత రంగు దుస్తులు వేసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం.
మోచేతుల నలుపు పోవటానికి ఖరీదైన కాస్మొటిక్స్ ఏమి వాడవలసిన అవసరం లేదు.మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
అరకప్పు నీటిలో పుదీనా ఆకులను వేసి మరిగించాలి.
ఆ నీటిని వడకట్టి నిమ్మరసం కలపాలి.ఈ నీటిలో కాటన్ బాల్ ముంచి నల్లని మోచేతులపై రాసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
ఇలా వారంలో మూడు సార్లు చేస్తూ ఉండాలి.
ఆలివ్ నూనె,పంచదార సమాన పరిమాణంలో తీసుకోని బాగా కలిపి నల్లని మోచేతుల భాగంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత తేలికపాటి సబ్బుతో శుభ్రం చేయాలి.
వంటసోడాలో పాలను కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ రంగును తగ్గిస్తే, వంట సోడా మృతకణాలను చర్మంపై నుండి తొలగిస్తుంది.
ఒక స్పూన్ కొబ్బరినూనెలో అరస్పూన్ నిమ్మరసం కలిపి నల్లని మోచేతులపై రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరినూనె తేమను అందివ్వటమే కాక, సహజంగా రంగును విఛ్చిన్నం చేసే బ్లీచర్ కూడా పనిచేస్తుంది.