జలుబు చేసిన‌ప్పుడు చేయ‌కూడ‌ని త‌ప్పులు ఏంటో తెలుసా?

జలుబు.ప్రస్తుత వర్షాకాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వయసుల వారిని వేధించే కామన్ సమస్య ఇది.అయితే ఒక్కోసారి జలుబు పట్టుకుందంటే ఓ పట్టాన‌ వదలదు.పైగా జలుబు చేసిందంటే వెంట వెంటనే దగ్గు, జ్వరం వంటి సమస్యలు కూడా చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయి.

 Do You Know What Mistakes To Avoid When You Have A Cold? Cold, Mistakes, Health,-TeluguStop.com

అయితే కొంద‌రు తెలిసో తెలియకో జలుబు చేసినప్పుడు కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు.ఆ తప్పులు వల్ల జలుబు మరింత తీవ్ర తరంగా మారుతుంటుంది.అసలు జలుబు చేసినప్పుడు చేయకూడని తప్పులు ఏంటి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది జలుబు చేసినప్పుడు రెగ్యులర్ ఫుడ్ ను తీసేసుకుంటారు.మరియు లిక్విడ్ ఫుడ్స్ ను ఎవైడ్ చేస్తుంటారు.కానీ ఇది చాలా తప్పు.జలుబు చేసినప్పుడు రెగ్యులర్ ఫుడ్స్ ను పక్కన పెట్టాలి.

లిక్విడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.ముఖ్యంగా సూప్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, జ్యూస్‌లు, పాలు వంటివి అధికంగా తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.

జలుబు చేసిందంటే చాలు కొంద‌రు వెంటనే మందులు వేసుకుంటారు.అయితే మందులు వేసుకున్నా వేసుకోకపోయినా జలుబు వారం రోజుల్లో తగ్గిపోతుంది.అందుకే ఓ మాదిరి జలుబు చేసినప్పుడు మందులు తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Telugu Tips, Rainy Season-Telugu Health Tips

కొందరు జలుబు చేసినప్పుడు రెస్ట్ పేరుతో లీవ్ తీసుకుని మొబైల్ ఫోన్లతో టైమ్ గ‌డుపుతుంటారు.కానీ ఇలా చేయ‌డం చాలా తప్పు.జలుబు చేసినప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, టీవీ వంటి వాటిని దూరం పెట్టాలి.

హాయిగా నిద్రపోవాలి.కంటి నిండా నిద్ర ఉంటే ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్ అవుతుంది.

తద్వారా జలుబు త్వరగా దూరం అవుతుంది.

ఇక జలుబు చేసినప్పుడు చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు.

ఇలా అస్స‌లు చేయ‌కండి.ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది.

ఫలితంగా జలుబు త‌గ్గ‌డం కాదు.మరింత తీవ్రతరం అవుతుంది.

అందుకే జలుబు చేసినప్పుడు పొరపాటున కూడా ఆల్కహాల్ ను తీసుకోరాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube