మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.మొత్తం 36 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా.
చివరగా 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.వీరిలో బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతితో పాటు టీజేఎస్, బీఎస్పీ ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
ప్రధాన పోటీ మాత్రం బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య నెలకొని ఉంది.మునుగోడు లో ఎవరు విజయం సాధిస్తారానే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.







