యూకేలోని అతిపెద్ద సైకిల్ తయారీదారైన బ్రాంప్టన్ కంపెనీ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.అత్యంత తేలికైన బ్రోంప్టన్ ఎలక్ట్రిక్ బైక్(సైకిల్)ను విడుదల చేసింది.ఈ ఫోల్టబుల్ ఎలక్ట్రిక్ బైక్ 12.7 కేజీ నుంచి 15.6 కేజీ బరువు ఉంటుంది.దీనికి డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
దాని టైటానియం అడ్వాన్స్‌డ్ రియర్ ఫ్రేమ్, మెరుగైన పోర్టబిలిటీ ఫీచర్‌లతో, ఈ ఇ-బైక్‌ను మడిచి పెట్టొచ్చు.
ఇది కంపెనీ యొక్క సూపర్‌లైట్ 4-స్పీడ్ గేరింగ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న మొదటి బ్రోంప్టన్ ఎలక్ట్రిక్ బైక్.
ఇది రెండు మోడళ్లు పీ, టీ మోడళ్లలో లభిస్తోంది.బ్రోంప్టన్ ఎలక్ట్రిక్ P లైన్ మూడు స్థాయిల పవర్ అసిస్ట్‌తో గంటకు 25 కి.మీ వేగంతో కదులుతుంది.రైడర్లు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
అన్ని బ్రోంప్టన్ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ బైక్‌లు లండన్, షెఫీల్డ్‌లోని ప్రత్యేక బృందాలతో తయారు చేయబడ్డాయి.ఇవి అత్యంత నాణ్యతతో ఉంటాయి.వీటిపై విల్ బట్లర్-ఆడమ్స్( Brompton Bicycle CEO) ఇలా స్పందించారు.తాము Brompton Electric P లైన్‌ను ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామని చెప్పారు.

ఇది మార్కెట్లో అత్యంత కాంపాక్ట్ ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ బైక్ అని వివరించారు.పీ లైన్ మరియు టీ లైన్ మోడళ్లలో తమ డిజైన్లు అద్భుతంగా ఉంటాయన్నారు.తేలికగా, మడవగలిగేలా ఉంటాయని చెప్పారు.
Brompton బైక్‌లు ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలలో విక్రయించబడుతున్నాయి.
ఉత్పత్తి అయిన వాటిలో 75% పైగా ఎగుమతి చేయబడుతున్నాయి.కంపెనీ సంవత్సరానికి 1,15,000 ఎలక్ట్రిక్ బైక్‌లను ఉత్పత్తి చేస్తుంది.
ఆవిష్కర్త ఆండ్రూ రిట్చీ 1975లో మొదటి బైక్‌ను తయారు చేశారు.ఇప్పటి వరకు 8,50,000 పైగా ఎలక్ట్రిక్ బైక్(సైకిల్స్) రోడ్లపైకి వచ్చాయి.







