ఆరోగ్యంతో పాటు అందము ముఖ్యమే అని భావించేవారు చాలామంది.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ జ్యూస్ డైట్ లో కనుక చేర్చుకుంటే ఆరోగ్యం, అందం రెండు పెరగడం ఖాయం.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అది అందించే ప్రయోజనాలు ఏంటి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు యాపిల్ ముక్కలు( Apple slices ) వేసుకోవాలి.అలాగే అరకప్పు పీల్ తొలగించిన కీర దోసకాయ ( Cucumber )ముక్కలు, రెండు లేదా మూడు పాలకూర ఆకులు( Lettuce leaves ), మూడు పుదీనా ఆకులు వేసుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఆపై అందులో వన్ టేబుల్ తేనె కలిపారంటే మన జ్యూస్ అనేది రెడీ అయినట్లే.ఈ యాపిల్ కీర పాలకూర జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ మిక్స్డ్ జ్యూస్ లో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) పుష్కలంగా ఉంటాయి.యాపిల్ మరియు పాలకూరలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.కీరా అధిక నీటి శాతానికి ప్రసిద్ధి చెందింది.
ఇది బాడీని హైడ్రేట్‌గా ఉంచడంతో తోడ్పడుతుంది.అలాగే యాపిల్ కీర పాలకూర జ్యూస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు వాటి ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతికి దోహదం చేసి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి.

ఈ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి.అదే సమయంలో ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి.మొటిమలు, మచ్చలకు చెక్ పెట్టి యవ్వనమైన మెరిసే చర్మాన్ని మీసొంతం చేస్తాయి.అంతేకాదండోయ్.యాపిల్ కీర పాలకూర జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే అధిక కోలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.లివర్ క్లీన్సింగ్ జరుగుతుంది.
రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.మరియు ఎముకలు సైతం దృఢంగా మారతాయి.