నిద్ర( sleep ) అనేది మన ఆరోగ్యానికి, జీవనశైలికి ఒక మూలస్తంభం లాంటిది.ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం.
సరైన నిద్ర మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.అందుకే కండి నిండా కునుకు ఉండేలా చూసుకోవాలి.
కానీ, ప్రస్తుత రోజుల్లో నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.ఫోన్ లేదా టీవీ మైకంలో పడి రాత్రుళ్లు ఆలస్యంగా పాడుకోవడం అలవాటు చేసేసుకుంటున్నారు.
మీకు కూడా ఈ అలవాటు ఉంది.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పక తెలుసుకోండి.
రోజూ ఆలస్యంగా పడుకోవడం అంటే రాత్రి 12 లేదా అంతకంటే తర్వాత పడుకోవడం అనేది ఒక అలవాటుగా మారితే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా సరైన నిద్ర లేకపోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.
డిసిషన్ మేకింగ్, మెమరీ పవర్, క్రియేటివిటీ సిల్క్ ( Decision Making, Memory Power, Creativity Silk )తగ్గుతాయి.ఏకాగ్రతను కోల్పోతారు.మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తాయి.

అలాగే రాత్రుళ్లు అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటే జంక్ ఫుడ్( Junk food ) తినే అవకాశం పెరుగుతుంది.దాంతో మెటబాలిజం మందగిస్తుంది.ఫలితంగా బరువు పెరుగుతారు.
రోజూ నైట్ లేట్ గా పడుకోవడం వల్ల బాడీ హార్మోన్‌లు సరిగ్గా పని చేయవు.ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
అనియమిత నిద్ర వల్ల రక్తపోటు, గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతుంది.అంతేకాకుండా సరైన నిద్ర లేకుండా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది.
దాంతో తరచూ జబ్బు బడతారు.

కాబట్టి, ఇక నుంచైనా మంచి స్లీప్ సైకిల్ ను మెయింటైన్ చేయండి.మంచి ఆరోగ్యానికి, నిద్ర నాణ్యతను పెంచుకోవాలనుకుంటే రోజూ రాత్రి 9:30 నుంచి 11 మధ్యలో పడుకోడం అలవాటు చేసుకుంది.పడుకునే ముందు మొబైల్, టీవీ దూరంగా పెట్టండి.
కాఫీ, టీ వంటివి రాత్రి తీసుకోవడం మానేయండి.నిద్ర అనేది ఒక రీసెట్ బటన్ లాంటిది.
టైమ్ టు టైమ్ నిద్రిస్తే శరీరం మరియు మైండ్ రెండూ తిరిగి రీఛార్జ్ అవుతాయి.ప్రశాంతత, పాజిటివ్ ఫీలింగ్స్ లభిస్తాయి.