ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి అమ్మాయి అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటుంది.కానీ మారుతున్న జీవన శైలి, కాలుష్యం కారణంగా చాలా మందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి.
ముఖ్యంగా చాలా మంది ప్రస్తుతం డార్క్ సర్కిల్ ( Dark circle )సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్నారు.
అంతే కాకుండా చాలా మంది ఖరీదైన చికిత్సలు కూడా చేయించుకుంటూ ఉన్నారు.వీటి వల్ల కొన్ని రోజుల్లో ఉపశమనం పొందినప్పటికీ భవిష్యత్తులో తీవ్ర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని సౌందర్యా నీపుణులు చెబుతున్నారు.

అయితే ఈ డార్క్ సర్కిల్స్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు.ఆ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బాదంలో శరీరానికి కావాల్సిన విటమిన్ ఇ( Vitamin E ) ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇందులో ఉండే గుణాలు చర్మానికి తేమను అందించి పొడిబారడాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అంతే కాకుండా డార్క్ సర్కిల్స్ నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

అలాగే బ్లూ బెర్రీలలో( blue berries ) విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి.కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల చర్మంలోని రక్త కణాలను మెరుగుపరుస్తాయి.అలాగే నల్లటి మచ్చలను తగ్గించేందుకు ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే బచ్చలి కూర కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇందులో లభించే ఐరన్ చర్మం లోని రక్తనాళాలను మెరుగుపరిచి, నల్లటి వలయాలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.