మధుమేహులకు వరం పైనాపిల్.. ఈ విధంగా తీసుకుంటే మస్తు బెనిఫిట్స్!

పైనాపిల్. ఈ ప్రకృతి ప్రసాదించిన అమోఘమైన పండు ఇది.పులుపు, తీపి రుచులు కలగలిసి ఉండే పైనాపిల్ లో పోషకాలు మెండుగా ఉంటాయి.ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ సైతం పైనాపిల్ లో నిండి ఉంటాయి.

 Taking Pineapple In This Way Is Very Good For Diabetics Details! Diabetes, Pinea-TeluguStop.com

అందుకే ఆరోగ్యపరంగా పైనాపిల్ అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ముఖ్యంగా మధుమేహులకు పైనాపిల్ వరం అనే చెప్పవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడానికి పైనాపిల్ అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం మూడు పైనాపిల్ స్లైసెస్ ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కల‌ను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో దంచి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి.

అలాగే ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులను వేసుకోవాలి.చివరిగా పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు ఒక గ్లాస్‌ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి.

చివరిగా మూత పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఉదయం గ్లాస్ జార్ నుంచి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.ఈ విధంగా చేస్తే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

అదే సమయంలో వెయిట్ లాస్ అవుతారు.

బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.జలుబు ద‌గ్గు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.

ఆస్త‌మా ల‌క్ష‌ణాలు అదుపులో ఉంటాయి.హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు మలినాలు తొల‌గిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి ల‌భిస్తుంది.మరియు కీళ్ల నొప్పుల నుంచి సైతం ఉప‌శ‌మ‌నాన్ని పొందుతారు.

కాబట్టి తప్పకుండా పైనాపిల్‌ను పైన చెప్పిన విధంగా తీసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube