ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడో లేదో తెలియదు కానీ శ్రీహరి లో మాత్రం నిజంగా ఒక దేవుడు ఉన్నాడు.ఈ మాట ఎందుకు అన్నానో తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.
ఒక రోజు అర్ద రాత్రి నటుడు శ్రీహరి కి ఒక ఫోన్ కాల్ వచ్చింది.అవతల మాట్లాడే వ్యక్తి ఏడుస్తూ తాము షిరిడి నుంచి హైదరాబాద్ కి వస్తున్నాం అండి, నేను నా భార్య పిల్లలల్తో దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నాం, అయితే ఈ బస్సులో ఒక ఐదుగురు వ్యక్తులు తాగి బస్సు ఎక్కారు.పైగా నా కూతుర్ల పట్ల అసభ్యంగా కామెంట్స్ చేసారండి.
కోపంలో తిట్టేసాను.
కానీ వారు దుర్భాషలాడుతూ హైదరాబాద్ చేరుకునే సరికి సనత్ నగర్ లో నిన్ను చంపేసి పోతాం అంటూ బెదిరిస్తున్నారు అంటూ గడ గడ ఏడుస్తున్నాడు.అప్పుడు శ్రీహరి గారు, అవతల మనిషిని ని ముందు సముదాయించి, దైవ దర్శనం చేసుకొని వస్తున్నావ్ మనస్సు ప్రశాంతం గా ఉంచుకొకొ నువ్వు బస్సు దిగేసరికి నీ కోసం నా మనుషులను పంపిస్తాను అని చెప్పారట.
సరిగ్గా తెల్లవారు జామున ఐదున్నర ప్రాంతం లో బస్సు సనత్ నగర్ కి చేరుకుంది.అక్కడ బాస్ స్టాండ్ లో నిద్ర మత్తులో ఒక టీ షార్ట్, లుంగీ కట్టుకొని శ్రీహరి గారు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.
అప్పుడు శ్రీహరిని చుసిన ఆ తాగుబోతులు గమ్మున అక్కడ నుంచి వెళ్లిపోయారట.ఆలా ఒక ఫ్యామిలీ ని కాపాడిన దేవుడు శ్రీహరి.
ఈ ఒక్క సంఘటన మాత్రమే కాకుండా అయన జీవితంలో ఇలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిగి ఉంటాయి. అడిగిన వారికి కాదనకుండా, లేదనకుండా సహాయం చేయడం లో శ్రీహరి ఎప్పుడు ముందు ఉంటారు అని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు.ఈ విషయాన్నీ దర్శకుడు బాబీ ఒక ఈవెంట్ లో అక్కడ ఉన్నవారికి స్టేజ్ పైన పంచుకోవడం తో అందరికి తెలిసింది.లేకపోతే అవి చెప్పడానికి ఇప్పుడు మన మధ్య శ్రీహరి లేరు.
అలాంటివి ఎన్నో సంఘటనలు, గొప్ప పనులు చేసిన శ్రీహరి సైతం ఈనాడు తాను చేసిన మంచి గురించి ఎవరికి షేర్ చేయలేదు.అందుకే అయన దేవుడిలా ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు.