కాపు, కమ్మ వర్గ పోరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్లన్న.. అదో రోత రాజకీయం అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు బండ్ల గణేష్.

 Bandla Ganesh Controversial Comments About Ap Politics , Bandla Ganesh Controver-TeluguStop.com

మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఎవరైనా అంటే వెంటనే వారిపై విరుచుకుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

రాజకీయాలకు సినిమాలకు సంబంధించిన ఏదో ఒక విషయంలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అంతేకాకుండా రాజకీయాలకు సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంటర్వ్యూలలో సెన్సేషనల్ వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిర్మాతగా మారడం వరకు తన సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఎన్నో అవాంతరాలను అవమానాలను కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.ఆంధ్రప్రదేశ్లో ఆదిపత్య పోరు నడుస్తోంది.కులాలను వేరు చేసి కొట్టుకుంటున్నారు.వాటిపై మీ అభిప్రాయం ఏంటి అనీ సదరు యాంకర్ ప్రశ్నించగా.

ఎవరికి తెలుసు సార్, ఆంధ్ర సంగతి.అదొక పెద్ద రోత రాజకీయం.

మనకెందుకు అని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.ఇంటర్వ్యూలో భాగంగా బండ్ల గణేష్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Ap, Bandla Ganesh, Bandlaganesh, Pawan Kalyan, Tollywood-Movie

అయితే ఎన్నో సినిమాలలో నటుడిగా నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి తల సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా హీరోగా మారి సినిమాలలో నటిస్తున్నాడు మన బండ్లన్న.అంతేకాకుండా తరచూ వార్తలో నిలిచే వారిలో బండ గణేష్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.సోషల్ మీడియాలో జరిగే పలు కార్యక్రమాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.

అలాగే సమాజంలో జరిగే పలు సమస్యలపై కూడా స్పందిస్తూ ఉంటారు.అయితే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తూ ఉంటాడు బండ్ల గణేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube