అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా.? బరువు తగ్గడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ హెర్బల్ టీ ని రోజుకో కప్పు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే వెయిట్ లాస్( Weight loss ) నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ టీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు రెండు అంగుళాల దాల్చిన చెక్క( Cinnamon )ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు అంగుళాల ఎండిన అల్లం ముక్క వేసుకుని స్లైట్ గా వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టార్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే పది ఫ్రెష్ తులసి ఆకులు మరియు తయారు చేసి పెట్టుకున్న పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.అంతే మన హెర్బల్ టీ సిద్ధం అయినట్టే.రోజు ఉదయం ఈ హెర్బల్ టీ తాగితే శరీరంలో క్యాలరీలు చాలా వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులు ఈ హెర్బల్ టీ ని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్( Blood Sugar) లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడానికి ఈ హెర్బల్ టీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.అంతేకాదు ఈ హెర్బల్ టీ ను రోజు తాగితే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
మలబద్ధకం సైతం దూరం అవుతుంది.







