1.రాహుల్ గాంధీ పై అనర్హత వేటు

మోదీ ఇంటి పేరు కలవారు అందరూ దొంగలే అంoటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది.ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నుంచి సర్కులర్ జారీ అయింది.1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 (3) ప్రoకారం ఆయనపై అనర్హత వేటు పడింది.
2 .విద్యుత్ సౌదా ముందు ఉద్యోగుల ధర్నా
తెలంగాణ విద్యుత్ సౌధ ముందు విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మహా ధర్నాకు దిగారు.ఈ ధర్నాలో 30 వేల మంది కి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు.
3.పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటా : రాఘవులు

సిపిఎం పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటానంటూ పార్టీ సీనియర్ నేత రాఘవులు పొలిట్ బ్యూరో కు లేఖ రాశారు.
4.మోదీ పై పరువు నష్టం దావా వేస్తా : రేణుక చౌదరి
కాంగ్రెస్ సీనియర్ నేత ఖమ్మం మాజీ ఎంపీ రేణుక చౌదరి సంచలన ట్వీట్ చేశారు.పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ లోని సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, రేణుక చౌదరి ప్రధాని నరేంద్ర మోదీ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు.
5.రేవంత్ ఇంటి వద్ద టెన్షన్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ మహాదీక్షకు హాజరు కావడంపై టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.ఈరోజు ఓయూ జేఏసీ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరుద్యోగ మహాదీక్ష జరగనుంది.దీంతో రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లకుండా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
6.ముందస్తుగా కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ను అక్రమంగా అరెస్ట్ చేయడానికి నిరసనగా టి.పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కీలక నాయకులు అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
7.సిట్ అధికారులకు బండి సంజయ్ లేఖ

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అధికారులకు లేఖ రాశారు.తనకు సిట్ నోటీసులు అందలేదని ఆ లేఖలో సంజయ్ పేర్కొన్నారు.
8.ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అత్యవసర సమావేశం
ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు.పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.
9.కర్ణాటక కు ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కర్ణాటకకు వెళ్ళనున్నారు.శనివారం దావణ గెరె, చిక్క బళ్లాపుర, బెంగళూరులలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.
10.తిరుమల సమాచారం
ఈరోజు ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.
11.రేవంత్ , బండి సంజయ్ కు నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.
12.సంజయ్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.గుజరాత్ లో ఎందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
13.మహిళా బిల్లును తీసుకురావాలి : కవిత

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విధంగా మహిళా బిల్లును తీసుకురావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ట్వీట్ చేశారు.
14.ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లలో భూకంపాలు
ఈరోజు ఛత్తీస్ ఘడ్ లోని అంబికాపూర్ లో 4.1 తీవ్రత తో ఉదయం అంబికాపూర్ 4.1 తీవ్రతతో ఉదయం 11:30 నిమిషాల ప్రాంతంలో భూకంపం సంభవించింది.అలాగే మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు ఆగ్నేయంగా 28 కిలోమీటర్ల దూరంలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
15. చంద్రబాబు పై వల్లభనేని వంశి కామెంట్స్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవడం పై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి స్పందించారు.ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ వంశీ కామెంట్స్ చేసారు.
16 .క్రాస్ ఓటింగ్ చేసినవారికి శిక్ష తప్పదు : కాకాని
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే లపై చర్యలు తప్పవని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
17 .టీడీపీ పై రోజా కామెంట్స్

రాబోయే ఎన్నికల్లో టీడీపీ కి రెండు సీట్లు కూడా రావని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
18 .మావోయిస్టు ల డంప్ సీజ్
అల్లూరి జిల్లాలో మావోయిస్టు ల భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
19 .పదో తరగతి పరీక్షలు

తెలంగాణ లో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
20.టీడీపీ లో చేరిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు.