టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరైన నాగవంశీ మ్యాడ్2 (Naga Vamsi, Mad 2)సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.నా సినిమాలు బ్యాన్ చేయండంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు.
నేను ఓపెన్ గా చెబుతున్నానని నా సినిమా ఆర్టికల్స్ రాయొద్దని నా సినిమాలకు రివ్యూలు (Movie reviews)ఇవ్వవద్దని నాగవంశీ పేర్కొన్నారు.మన మీద బ్రతుకుతూ మనల్ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారని ఆయన కామెంట్లు చేశారు.
నేను రివ్యూవర్లకు నచ్చే సినిమా తీయలేదని పక్కా కమర్షియల్ సినిమా తీశానని నాగవంశీ (Naga Vamsi)పేర్కొన్నారు.నా సినిమా కలెక్షన్లు ఫేక్ అనే వాళ్లకు ఫోన్ లో కలెక్షన్లు చూపిస్తానని ఆయన తెలిపారు.సినిమా ఆడుతుంటే ఆ సినిమాను ఎందుకు సపోర్ట్ చేయలేదని నాగవంశీ వెల్లడించారు.మ్యాడ్2 (Mad 2)సినిమాకు రివ్యూలు బాగా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

రివ్యూ(Reviwes) అనేది ఒక మనిషి వ్యక్తిగత అభిప్రాయమని రివ్యూలను దయచేసి నమ్మవద్దని నాగవంశీ కోరారు.మ్యాడ్ స్క్వేర్ (
Mad Square)దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందని ఆయన తెలిపారు.సినిమా బాగా అడుతున్న సమయంలో ఎందుకు సపోర్ట్ చేయట్లేదని నాగవంశీ అన్నారు.సినిమాకు ఎంటర్టైన్మెంట్ స్టార్ అని ఆయన తెలిపారు.ప్రోమో, పాట, ట్రైలర్ నచ్చితేనే టికెట్లు నచ్చుతాయని నాగవంశీ పేర్కొన్నారు.

మ్యాడ్2 ఓవర్సీస్ సెన్సార్ కాపీ పైరసీ వెర్షన్ రిలీజ్ అయిందని ఆయన అన్నారు.ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో చూడాలని నాగవంశీ వెల్లడించారు.పైరసీ రాబోయే రోజుల్లో మరింత డ్యామేజ్ చేస్తుందని ఆయన తెలిపారు.
రివ్యూ రైటర్లు వాళ్లు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారని నాగవంశీ పేర్కొన్నారు.నాగవంశీ చేసిన కామెంట్ల గురించి రివ్యూవర్ల నుంచి, మీడియా సంస్థల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
ప్రధానంగా వెబ్ మీడియాను నాగవంశీ టార్గెట్ చేయడం గమనార్హం.