ముఖ చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకునేందుకు చాలా మంది మార్కెట్లో లభ్యం అయ్యే క్రీమ్ లపై ఆధారపడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను కనుక వాడితే మీ ముఖ చర్మం కొద్ది రోజుల్లోనే బ్రైట్ అండ్ వైట్ గా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) మరియు నాలుగు నుంచి ఐదు లెమన్ స్లైసెస్ వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమం నుంచి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జెల్ లో చిటికెడు కుంకుమపువ్వు, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన ఫేస్ క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను చర్మానికి అప్లై చేసుకుని నిద్రించాలి.

మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖ చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ప్రతిరోజు కనుక చేస్తే స్కిన్ టోన్ క్రమంగా మెరుగుపడుతుంది.చర్మం బ్రైట్ గా మెరుస్తుంది.అంతే కాదు ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే మాయమవుతాయి.డార్క్ సర్కిల్స్( Dark Circles ) నుంచి విముక్తి లభిస్తుంది.
మొండి మొటిమలు సైతం చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.కాబట్టి అందంగా తెల్లగా మరియు కాంతివంతంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.