చలాకి చంటి (Chanti)పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చంటి వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈయన బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమంలో కూడా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.
ఈ బిగ్ బాస్ తర్వాత చలాకి చంటి పెద్దగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా కనిపించలేదు.అయితే బిగ్ బాస్ తర్వాత ఈయన అనారోగ్యానికి గురి అయ్యి హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.
గుండెపోటుకు(Heart Attak) గురై చంటి హాస్పిటల్ పాలైన విషయం తెలిసిందే .

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేను హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ పాలైతే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు.కొంత మంది మాత్రం ఎలా ఉంది అంటూ పరామర్శించారు.
రియల్ లైఫ్ లో ఎవరూ హెల్ప్ చేయరు.డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాము.
డబ్బులు లేకపోతే ఎవరూ వచ్చి మనకు సహాయం చేయలేరు ప్రతి ఒక్కరి జీవితం ఇంతేనని తెలిపారు.ముఖ్యంగా డబ్బు విషయంలో మనం ఎవరిని ఆశించకూడదు అని చంటీ తెలిపారు.

తాను కష్టాలలో ఉంటే ఎవరు కూడా తనకు సహాయం చేయలేదని తెలిపారు అయితే నేను ఆరోగ్యంగా ఉండి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో మాత్రం చాలా మంది నన్ను తొక్కేసి నా అవకాశాలను లాక్కోవాలని చూశారు.నా జీవితాన్ని తలక్రిందులు చేసిన నలుగురు వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు ఇది నా శాపం అంటూ ఆ ఇంటర్వ్యూలో చంటి పేర్కొన్నాడు.నన్ను నమ్మించి నాకు వెన్నుపోటు పొడిచిన వారు ఆ భగవంతుని సాక్షిగా నాశనం అవుతారు.ఆ నలుగురి నాశనం చూసిన తర్వాతనే తాను కూడా చనిపోతాను అంటూ ఈయన మాట్లాడిన మాటలు సంచలనగా మారాయి.
అయితే ఆ నలుగురు ఎవరు అనే విషయాన్ని మాత్రం చంటి వెల్లడించలేదు.