ప్రస్తుతం మనకు వంటలు చేసుకోవడానికి నాన్‌స్టిక్, అల్యూమినియం, సిరామిక్, స్టీల్ ఇలా ఎన్నో రకాల పాత్రలు అందుబాటులోకి వచ్చాయి.అలాగే రైస్ కుక్కర్, కరెంట్ కుక్కర్ల వినియోగం కూడా భారీగా పెరిగింది.
ఇటువంటి వాటిల్లో ఆహారం వండుకుని తినడం వల్ల అనేక రుగ్మతలకు లోనవుతున్నారు.అయితే పూర్వకాలం ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలు( Clay Pots ) ఉపయోగించేవారు.వంట చేసుకోవడానికి, వండినది తినడానికి మట్టి పాత్రలనే వాడేవారు.అప్పట్లో ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.క్రమంగా మట్టి పాత్రల వినియోగం తగ్గింది.కేవలం వేసవికాలంలోనే మట్టి కుండలను మంచినీరు( Water ) తాగేందుకే ఉపయోగిస్తూ వస్తున్నారు.
కానీ, ఇటీవల కాలంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం వల్ల మళ్ళీ కొంత మంది మట్టి పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు.మట్టి పాత్రలను వంటలకు వాడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మట్టి పాత్రల్లో వంటలు( Cooking ) వండుకుని తినడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.అన్ని రకాల వంటలకు మట్టి పాత్రలను ఉపయోగించవచ్చు.
ఎంత వేడి చేసిన తట్టుకునే సామర్థ్యం వాటికి ఉంటుంది.పైగా మట్టి పాత్రల్లో వాడటం వల్ల ఆ వంటకు రుచి మరింత పెరుగుతుంది.
మట్టి పాత్రల తయారీలో ఎటువంటి కెమికల్స్ ను ఉపయోగించరు.అందువల్ల మట్టి పాత్రలో వంటలు వండుకుని తినడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం ఉండదు.మట్టి పాత్రల్లో వంట చాలా త్వరగా పూర్తవుతుంది.ఎందుకంటే మట్టి పాత్రలు వేగంగా వేడెక్కుతాయి.దాంతో లోపల ఉండే పదార్థాలు త్వరగా ఉడుకుతాయి.అలాగే మట్టిలో విటమిన్ ఎ,( Vitamin A ) విటమిన్ డి,( Vitamin D ) విటమిన్ సి, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి.
ఈ పోషకాలు మనం వండుకునే ఆహారాలకు తోడవుతాయి.ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.
మట్టి పాత్రలో వంటలు వండితే అవి ఎక్కువ సేపు వేడిగా ఉంటాయి.దాంతో ఆహారాన్ని ( Food ) పదేపదే వేడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు.పైగా మట్టి పాత్రల్లో వంటలకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు.ఆయిల్ వాడకం తగ్గితే అధిక బరువు( Over Weight ) నుంచి గుండె జబ్బుల( Heart Diseases ) వరకు ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ఇక మట్టి పాత్రల్లో వంటలను కట్టెల పొయ్యి మీదే చేయాల్సిన అవసరం లేదు.గ్యాస్ పొయ్యి మీద కూడా చక్కగా చేసుకోవచ్చు.కాబట్టి ఆరోగ్యం మరియు మంచి రుచికరమైన భోజనం కోసం మీరు కూడా మట్టి పాత్రలు వాడేందుకు ప్రయత్నించండి.