బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఒక్కటి తీసుకుంటే రక్తహీనత మీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌దు!

రక్తహీనత( anemia ).దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 This Smoothie Helps To Get Rid Of Anemia Quickly! Anemia, Smoothie, Healthy Smoo-TeluguStop.com

ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు ఎవరో ఒకరు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు.ఇలాంటి వారు ఎప్పుడూ చాలా నీరసంగా కనిపిస్తుంటారు.

ఏ పనిలోనూ చురుగ్గా పాల్గొనలేక పోతుంటారు.ఇక రక్తహీనత క్రమంగా కొనసాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

అందుకే రక్తహీనత గురించి బయటపడటం కోసం మందులు వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీని చేర్చుకోవాల్సిందే.

Telugu Anemia, Tips, Latest, Papaya Smoothie, Smoothie-Telugu Health

ఈ స్మూతీని తీసుకుంటే ఎలాంటి రక్తహీనత అయినా సరే దెబ్బకు పరార్ అయిపోతుంది.మ‌ళ్లీ మీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌దు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న బొప్పాయి పండును( Papaya fruit ) తీసుకొని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పండు ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( flax seeds ), రెండు ఫ్రెష్ పాలకూర ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మంచి హెల్తీ బొప్పాయి స్మూతీ సిద్ధం అవుతుంది.

Telugu Anemia, Tips, Latest, Papaya Smoothie, Smoothie-Telugu Health

ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా శరీరానికి అవసరమయ్యే ఐరన్ ను అందించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.దాంతో రక్తహీనత సమస్య దెబ్బ‌కు దూరం అవుతుంది.

రక్తహీనతతో బాధపడేవారు బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఈ స్మూతీ లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును రెట్టింపు చేస్తుంది.

కాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది.అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం సైతం సూపర్ స్ట్రాంగ్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube