ఎండ‌ల దెబ్బ‌కు ముఖం డ‌ల్‌గా మారిందా? అయితే ఇవి ట్రై చేయండి!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ప‌ది నిమిషాలు ఎండ‌లో ఉన్నా ముఖ చ‌ర్మం క‌మిలి పోయి డ‌ల్‌గా మారుతుంటుంది.అందులోనూ సెన్సిటివ్ స్కిన్ వారు త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తుంటారు.

 Home Remedies To Get Rid Of Dull Skin Naturally , Home Remedies, Dull Skin, Latest News, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips, Face Packs-TeluguStop.com

డ‌ల్ స్కిన్ మ‌న ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది.లేనిపోని ఒత్తిడిని పెంచుతుంది.

దాంతో ప‌నిపై శ్ర‌ద్ధ త‌గ్గిపోతుంది.ఇలా మీకు అవుతుందా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను ట్రై చేస్తే ఎండ‌ల దెబ్బ‌కు డ‌ల్ గా మారిన మీ ముఖాన్ని క్ష‌ణాల్లో ఉత్తేజంగా మ‌రియు గ్లోయింగ్‌గా మార్చుకోవ‌చ్చు.

 Home Remedies To Get Rid Of Dull Skin Naturally , Home Remedies, Dull Skin, Latest News, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips, Face Packs-ఎండ‌ల దెబ్బ‌కు ముఖం డ‌ల్‌గా మారిందా అయితే ఇవి ట్రై చేయండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు ప‌చ్చ సొన‌ను వేసి స్పోర్క్‌ సాయంతో బాగా క‌ల‌పాలి.

ఇప్పుడు అందులో వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ మ‌రియు హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్రెష్‌తో కాస్త ముందంగా ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకుని.అప్పుడు గోరువెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్‌ చేసుకోవాలి.

ఇలా చేస్తే డ‌ల్‌గా ఉన్న ముఖం ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా మ‌రియు యాక్టివ్‌గా మారుతుంది.

అలాగే ఒక క్యారెట్‌ను తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని క‌లుపుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి పూర్తిగా డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube