ఎండ‌ల దెబ్బ‌కు ముఖం డ‌ల్‌గా మారిందా? అయితే ఇవి ట్రై చేయండి!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ప‌ది నిమిషాలు ఎండ‌లో ఉన్నా ముఖ చ‌ర్మం క‌మిలి పోయి డ‌ల్‌గా మారుతుంటుంది.

అందులోనూ సెన్సిటివ్ స్కిన్ వారు త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తుంటారు.డ‌ల్ స్కిన్ మ‌న ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది.

లేనిపోని ఒత్తిడిని పెంచుతుంది.దాంతో ప‌నిపై శ్ర‌ద్ధ త‌గ్గిపోతుంది.

ఇలా మీకు అవుతుందా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను ట్రై చేస్తే ఎండ‌ల దెబ్బ‌కు డ‌ల్ గా మారిన మీ ముఖాన్ని క్ష‌ణాల్లో ఉత్తేజంగా మ‌రియు గ్లోయింగ్‌గా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు ప‌చ్చ సొన‌ను వేసి స్పోర్క్‌ సాయంతో బాగా క‌ల‌పాలి.

ఇప్పుడు అందులో వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ మ‌రియు హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్రెష్‌తో కాస్త ముందంగా ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకుని.అప్పుడు గోరువెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్‌ చేసుకోవాలి.

ఇలా చేస్తే డ‌ల్‌గా ఉన్న ముఖం ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా మ‌రియు యాక్టివ్‌గా మారుతుంది.

"""/" / అలాగే ఒక క్యారెట్‌ను తీసుకుని వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగి స‌న్న‌గా తురుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని క‌లుపుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి పూర్తిగా డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

సీఎంపై రాయిదాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై రేపు ఆర్డర్