ప్రతి అమ్మాయి ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటుంది.ఆలా కోరుకోవడంలో తప్పు లేదు.
అయితే దాని కోసం ఏమి ఖర్చు చేయవలసిన అవసరం లేదు.ఎందుకంటే మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా సాధించవచ్చు.
ముఖ్యంగా ఈ పాక్స్ లో తేనెను ఉపయోగిస్తాం.తేనెలో యాంటీబాక్ట్రయల్ అలాగే యాంటీఇన్ఫలమేటరీ ప్రాపర్టీలు ఉండుట వలన అన్న రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
ఇప్పుడు ఆ పాక్స్ గురించి వివరంగా
తెలుసుకుందాం.

రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి కలిపి పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట తర్వాత
చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ
ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
ఒక స్పూన్ తేనెలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించి 15
నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా
వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మానికి
అవసరమైన పోషణ అందుతుంది.
రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.