ఇంట్లో దోమ‌లు పెరిగిపోయాయా? అయితే కాఫీ పౌడ‌ర్‌తో ఇలా చేయండి!

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో దోమ‌ల బెడ‌ద ఎంతలా పెరుగుతుందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు.

 How To Use Coffee Powder For Mosquito Repellent In House? Coffee Powder, Mosquit-TeluguStop.com

సాయంత్రం 6 అయిందంటే చాలు ఎక్క‌డ్లేని దోమ‌లు మ‌న ఇంట్లోనే దండ‌యాత్ర చేస్తుంటాయి.వాటి చేత‌ కుట్టించుకుంటే.

చికున్ గున్యా, మలేరియా, డెంగీ వంటి విష జ్వ‌రాల‌తో పాటు అంటు వ్యాధులు సైతం తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటాయి.అంత వ‌ర‌కు వెళ్ల‌కుండా ఉండ‌టం కోస‌మే ఇంట్లో ఉండే దోమ‌ల‌ను త‌రిమి కొట్టాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే ఇంట్లోని దోమ‌ల‌ను త‌రిమికొట్ట‌డానికి కాఫీ పౌడ‌ర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కాఫీ పౌడ‌ర్ కేవ‌లం కాఫీ త‌యారు చేయ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మంది భావిస్తారు.

కానీ, వాస్త‌వానికి కాఫీ పౌడ‌ర్ తో మ‌రెన్నో ఉప‌యోగాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇంట్లోని దోమ‌ల‌ను తరిమికొట్టడంలో కాఫీ పౌడ‌ర్ ఎఫెక్టీవ్ గా పని చేస్తుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్‌లో నిప్పులు తీసుకుని.అందులో ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్ ను కొంచెం కొంచెంగా వేస్తే పొగ వ‌స్తుంది.

ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయాలి.దాంతో ఇంట్లో దోమ‌లు ఎక్క‌డున్నా బ‌య‌ట‌కు పారిపోతాయి.

ఎందుకంటే, కాఫీ పౌడ‌ర్ వాస‌న దోమ‌ల‌కు అస్స‌లు న‌చ్చ‌దు.దోమ‌లే కాదు ఏవైనా కీటకాలు ఉన్నా కూడా ప‌రార్ అవుతాయి.

Telugu Benefitscoffee, Coffee Powder, Tips, Latest, Mosquito, Mosquitoes, Rainy

అలాగే దోమ‌ల‌కు దూరంగా ఉండాలంటే ఇంటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంట్లో చెత్త డబ్బాలో ఉన్న చెత్తను డైలీ పారేయాలి.తులసి, బంతి, లావెండర్‌.వంటి మొక్కలను ఇంటి చుట్టూ కుండీల్లో పెంచుకోవాలి.ఈ మొక్క‌లు ఉంటే దోమ‌లు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.ఇక వేప నూనె, కొబ్బరి నూనె కలిపి.

రోజూ సాయంత్రం శ‌రీరానికి రాసుకోవాలి.దాంతో ఆయా నూనెల వాస‌న‌కు దోమ‌ల ద‌గ్గ‌ర‌కు రావ‌డానికే భ‌య‌ప‌డ‌తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube