స్కిన్ టోన్ రోజురోజుకు తగ్గిపోతుందా.. వర్రీ వద్దు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి!

సాధారణంగా ఒకానొక సమయంలో స్కిన్ టోన్( Skin Tone ) తగ్గిపోతూ ఉంటుంది.ఇందుకు కారణాలు అనేకం.

 Wonderful Home Remedy For Improving Skin Tone!, Skin Tone, Skin Tone Improving R-TeluguStop.com

ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, పిగ్మెంటేషన్( Pigmentation ), పలు రకాల మందుల వాడకం, శరీరంలో అధిక వేడి తదితర కారణాల వల్ల స్కిన్ టోన్ తగ్గిపోతూ ఉంటుంది.ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొందరు మహిళలకు చర్మఛాయ త‌గ్గుతుంటుంది.

కారణం ఏదైనప్పటికీ స్కిన్ టోన్ తాగడం వల్ల చాలా మంది తీవ్రంగా మదన పడుతూ ఉంటారు.వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే మీ స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.మునుపటి కంటే ఎక్కువ తెల్లగా అందంగా మారతారు.

మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Tips, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Skin Tone, Skin Re

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు( Red Dal ), పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు వేసుకోవాలి.అలాగే అర కప్పు పచ్చి పాలు వేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.మీరు మిల్క్ ను అవాయిడ్ చేయాలి అనుకుంటే వాటర్ ను కూడా పోసుకోవచ్చు.

నాలుగు గంటల అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, కుంకుమ పువ్వును పాలతో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్, రెండు చుక్కలు ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతలకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన‌ అనంతరం వాటర్ తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఆపై మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Skin Tone, Skin Re

రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే మీ స్కిన్ టోన్ అద్భుతంగా పెరుగుతుంది.మునుపటి కంటే మీ చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) సైతం తొలగిపోయి చర్మం కోమలంగా మారుతుంది.

కాబట్టి తమ స్కిన్ టోన్ రోజురోజుకు తగ్గిపోతుందని భావిస్తున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube