హెర్బల్ టీ తో కరోనా కు చెక్..?

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ నుంచి తప్పించుకోడానికి ప్రజలు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు.

 Herbal Tea, Ashwagandha, Tea, Corona, Corona Tips, Immunity, Sanitizer-TeluguStop.com

అదే సమయంలో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఏకంగా మృత్యువు ఒడిలోకి చేరుతున్నవారు చాలామంది ఉన్నారు.ఇలా రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ ప్రజల్లో మరింత ప్రాణ భయాన్ని పెంచుతుంది.

అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చే నెలలు గడుస్తున్నప్పటికీ… ఇప్పటి వరకు ఈ మహమ్మారి వైరస్ కు పూర్తిస్థాయిలో ఎక్కడ వ్యాక్సిన్ మాత్రం అందుబాటులోకి రాలేదు.ఈ నేపథ్యంలో మన ప్రాణాలు మన చేతిలోనే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.

మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన ప్రాణాలు అంత పదిలంగా ఉంటాయి.ప్రస్తుతం మాస్కులు శానిటైజర్ ద్వారా కొంతమేర కరోనా వైరస్ దరిచేరకుండా ఆపుతున్నాము.

కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు కరోనా వైరస్ సోకక మానదు.ఇలాంటి నేపథ్యంలో కరోనా వైరస్ తో పోరాడేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవడమే మంచిది అని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీని తయారు చేసింది మొహాలీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటీకల్ అండ్ రీసెర్చ్.ప్రస్తుత హెర్బల్ టీ ద్వారా ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకోవడం ద్వారా కరోనా వైరస్ తో పోరాడే శక్తిని సంపాదిస్తారు అని చెబుతున్నారు నిపుణులు.

శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా తో పాటు ఈ మహమ్మారి వైరస్ ను కూడా రోగనిరోధకశక్తి పుష్టిగా ఉంటే సులభంగానే ఎదుర్కో కలుగుతామని నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఈ హెర్బల్ టీ స్థానికంగా అందుబాటులో ఉండే ఆరు రకాల హెర్బల్స్ అశ్వగంధ, తిప్పతీగ, మొల్లేటి, తులసి, గ్రీన్ టీ ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చట.

వీటికి తగిన పాళ్లలో కలిపి హెర్బల్ టీని తయారు చేసుకోవాలి దీనిని రోజుకు మూడు సార్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెపుతున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube