తనికెళ్ళ భరణి మామూలోడు కాదుగా..! ఆ హీరోయిన్ తో అంత ప్రేమాయణం నడిపాడా!

నటుడిగా ,రచయితగా మరియు ఒక గొప్ప దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అతి తక్కువ మంది లెజెండ్స్ లో ఒకరు తనికెళ్ళ భరణి( Tanikela Bharani ).ఈయన చెయ్యలేని పాత్ర అంటూ ఏది లేదు, భయంకరమైన విలనిజం పండించగలడు, అలాగే కామెడీ మరియు సెంటిమెంట్ ని కూడా అదే రేంజ్ లో పండించగలడు.

 Tanikella Bharani Is Not Normal He Played So Much Romance With That Heroine , Ro-TeluguStop.com

వంశీ దర్శకత్వం లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘లేడీస్ టైలర్’( Ladies Tailor ) అనే సినిమా ద్వారా పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు.మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి రచయితా కూడా ఆయనే.

నటించే ఆసక్తి లేకపోయినా డైరెక్టర్ వంశీ చొరవ తీసుకొని బ్రతిమిలాడడం తో ఒక చిన్న పాత్ర చేసాడు.ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది, ఆ తర్వాత రెండేళ్లు నటనకి దూరంగా కేవలం రచయితగానే ఆయన కొనసాగాడు, కానీ కళామ్మ తల్లి ఆయనని కేవలం రచయితగా మాత్రమే పరిమితం చెయ్యలేదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక బహుమతి లాంటి వాడివి , నువ్వు నటించాల్సిందే అని రామ్ గోపాల్ వర్మ రూపం లో చెప్పింది.

Telugu Rekha, Tailor, Romance, Shiva-Telugu Stop Exclusive Top Stories

ఆయన దర్శకత్వం వహించిన ‘శివ’ ( Shiva )చిత్రానికి తనికెళ్ళ భరణి కథ మరియు మాటలు అందించాడు, ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఈ చిత్రం తో తనికెళ్ళ భరణి జాతకమే మారిపోయింది, వరుసగా క్రేజీ సినిమాల్లో ఆఫర్స్ సంపాదిస్తూ అనతి కాలం లోనే స్టార్ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎదిగిపోయాడు.అలా శివ సినిమాతో ప్రారంభమైన తనికెళ్ళ భరణి సినీ కెరీర్, ఇప్పటికే ఎంతో అద్భుతంగా కొనసాగుతూనే ఉంది.తనికెళ్ళ భరణి ఏడాదికి కనీసం 10 సినిమాల్లో నటించాల్సిందే, ఆయనకీ ఉన్న డిమాండ్ అలాంటిది మరి.గత ఏడాది కూడా ఆయన 10 సినిమాల్లో నటించాడు, ఈయనతో పాటుగా కెరీర్ ని ప్రారంభించిన ఎంతో మంది క్యారక్టర్ ఆర్టిస్ట్స్ కి ఇప్పుడు డిమాండ్ బాగా తగ్గిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు.కానీ తనికెళ్ళ భరణి మాత్రం , నేటి తరం క్యారక్టర్ ఆర్టిస్టులకు కూడా పోటీని ఇస్తున్నాడంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Telugu Rekha, Tailor, Romance, Shiva-Telugu Stop Exclusive Top Stories

ఇది ఇలా ఉండగా తనికెళ్ళ భరణి గతం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.ఆయన ఇంటర్వ్యూస్( Interviews ) అన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి, మనసులో ఏది ఉంచుకోకుండా అడిగిన ప్రశ్నలకు ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేస్తుంటాడు.అలా ఆయన సినిమాలు చేస్తున్న రోజుల్లో బాలీవుడ్ హీరోయిన్ రేఖ( Heroine Rekha ) అంటే ఆయనకీ ఎంతో పిచ్చి అట.సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ రేఖ ని చూస్తే నాలో కలిగిన ఫీలింగ్స్ వేరే ఏ హీరోయిన్ ని చూసినప్పుడు కూడా కలుగలేదని చెప్పుకొచ్చాడు.అలా ఆయన ఆమె తో ఇప్పటీకీ వన్ సైడ్ లవ్ కొనసాగిస్తూనే ఉన్నాడట.ఇప్పటీకీ తన పుస్తక ఆవిష్కరణకి ఆమెని ముఖ్య అతిథిగా పిలవాలని నాకు తెలిసిన వాళ్ళ చేత ప్రయత్నం చేస్తూనే ఉన్నానని, కానీ కుదరడం లేదని తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube