జూన్ 2 నుంచి 22 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్యక్రమాలు జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా వేడుకలు ఏర్పాట్లు చేయాలి పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( anurag jayanthi ) రాజన్న సిరిసిల్ల జిల్లా దశాబ్ది ప్రగతి తో పాటు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.చాటేలా జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.
వచ్చే నెల జూన్ 2 నుంచి 22 వరకు జిల్లాలో జరుగు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామల నుంచి జిల్లా స్థాయి వరకు.ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో, కార్యక్రమాలను సమన్వయం చేసే అధికారిని సూచిస్తూ, చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించిదిశానిర్దేశం చేశారు.
గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరనీ సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణం లో నిర్వహించి.
విజయవంతం చేయాలని సూచించారు.రోజు వారి కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ శాఖలు పోస్టర్లు కరపత్రాలు ఫ్లెక్సీలను రూపొందించి జన సమ్మర్థక ప్రదేశాలలో, అలాగే కార్యక్రమాలను నిర్వహించే చోట అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
రోజువారి కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమ సమన్వయ అధికారులు ఫోటో కవరేజ్ ,వీడియో కవరేజ్ చేపించి కార్యక్రమం ముగిసిన అనంతరం వెంటనే సంబంధిత ఫోటోలను, వీడియో లను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం లో అందజేయాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్యప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీవోలు టి శ్రీనివాసరావు, పవన్ కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి పి.బి శ్రీనివాసచారి ,పరిపాలన అధికారి గంగయ్య తదితరులు పాల్గొన్నారు
.






