సుత్తి వీరభద్రరావు( Sutti Veerabhadra Rao )… పేరులో సుత్తి ఉంది అంటే అది ఆయన ఇంటి పేరు అనుకుంటారేమో .కాదండి బాబోయ్.
అది జంధ్యాల నటించిన ఒక సినిమాలోని పాత్ర పేరు.కానీ ఆ పాత్ర బాగా క్లిక్ అవడంతో ఆయనకు అది ఇంటి పేరుగా మారిపోయింది.
చాలా చిన్న వయసులో పెద్ద వయసు పాత్రలు చేయడం వలన ఆయన దాదాపు 60, 70 ఏళ్ళు బ్రతికారని అందరూ అనుకుంటారు.కానీ కేవలం 41 వయసులోనే ఆయన కన్నుమూశారు.
పైగా ఆయన ఏదో మామూలుగా చనిపోలేదు.సినిమా కోసం ఆయన తీసుకున్న రిస్క్ వల్లే ప్రమాదానికి గురై ఆ తర్వాత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని కన్నుమూశారు.
వీరభద్ర రావు అసలు పేరు మామిడిపల్లి వీరభద్ర రావు.మొదట్లో నాటకాలు వేసేవారు.స్టేజి ఆర్టిస్ట్ గా చాలా గొప్పగా పేరు సంపాదించుకున్నాడు.తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు.
తనతో పాటు ఎక్కడికి వెళ్లినా తన కొడుకును కూడా తీసుకెళ్లేవాడు.తండ్రి ఎదుగుదలను తన కొడుకు పూర్తిగా చూశాడు.
మొదట్లో ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి, ఆ తర్వాత చెన్నై( Chennai ) వెళ్లి, అక్కడ వీధి నాటకాలు వేసి ఆ తర్వాత స్టేజ్, డ్రామా అంటూ ఎన్నో కష్టాలు అధిగమించి గొప్ప నటుడిగా ఎదిగారు వీరభద్రరావు.ఆయన బతికున్నన్ని రోజులు ఇంటికి పిలిచి మరి అడ్వాన్సులు ఇచ్చేవారు.
ఆయన మరణం వారి కుటుంబానికి ఒక గుణపాఠం నేర్పింది.డబ్బంటే ఎంతటి మాయ చేస్తుందో తెలిసి వచ్చింది.
సరిగ్గా వీరభద్రరావు చనిపోయే సమయానికి ఆయనకు రావాల్సిన రెమ్యునరేషన్ నాలుగున్నర లక్షలు.ఆ కాలానికి అది చాల పెద్ద అమౌంట్.
ఆ డబ్బులు ఎలా అయినా నిర్మాతల నుంచి వసూలు చేయాలని వీరభద్రరావు కొడుకు పెద్ద యుద్ధమే చేశాడు.ప్రతి ఇంటికి వెళ్లి తమ నాన్నకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అంటూ అడిగాడు.చాలామంది గేటు బయట నుంచి పంపించేవారు.గంటలు గంటలు గేటు దగ్గర వెయిట్ చేయించేవారు.ఎంత ఇబ్బందులు అయినా కూడా ఆ డబ్బు తీసుకొని తమ సొంత ఊరు విజయవాడ వెళ్ళిపోవాలని అనుకున్నారు.అలా దాదాపు ఏడాది పాటు అందరి చుట్టూ తిరిగి తిరిగి ఆ డబ్బులను వసూలు చేశారు.
బ్రతుకు ఒక వేట అనే విషయం అప్పుడే ఆయనకు అర్థమైంది.తన తండ్రి కష్టార్జితాన్ని ఎవరికీ ఇవ్వకూడదనేది అతని సంకల్పం.
అలా అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు అయితే చేశాడు కానీ దాని కోసం ఎంతో పోగొట్టుకున్నాడు.జంధ్యాల( Jandhyala ) ఎంత డబ్బు ఇస్తానన్నా కూడా తీసుకోలేదు.తన తండ్రి కష్టపడి సంపాదించింది మాత్రమే కావాలని ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకాలని అనుకున్నాడు.అలా మొత్తానికి విజయవాడ వెళ్ళిపోయింది ఆ కుటుంబం.సరిగ్గా వీరభద్రరావు చనిపోయే సమయానికి అతడి కొడుక్కి 17 ఏళ్ల వయసు మాత్రమే.50 సినిమాల్లో నటించిన వీరభద్ర రావు చూపులు కలిసిన శుభవేళ సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తు కాలికి గాయం జరిగింది.ఆ గాయం పెద్ద గా వాపు వచ్చి చివరికి డయాబెటిస్ సోకింది.అలా ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చి 41 ఏళ్లకే కన్నుమూశారు.