ఆరోగ్యానికి మంచిదని ఆవాలను ఎక్కువగా తీసుకుంటే.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..?

ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో చాలామంది ప్రజలు వంటింటి దినుసులలో ముఖ్యంగా ఆవాలను( Mustards ) ఉపయోగిస్తూ ఉంటారు.మంచి పోపు వేయాలంటే ఎవరికైనా ముందు ఆవాలే గుర్తుకు వస్తూ ఉంటాయి.

 Amazing Health Benefits Of Mustards,mustard Seeds,digestive Problems,hair Growth-TeluguStop.com

ఆవాలను రెగ్యులర్ గా వంటల్లో ఉపయోగించడం వల్ల టేస్ట్ సువాసన అద్భుతంగా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.అయితే ఆవాలతో మంచి ప్రయోజనాలు ఉన్నాయని దాదాపు చాలామందికి తెలుసు.

ప్రస్తుతం ఈ ఆవాలు తెలుపు, గోధుమ, నలుపు రంగులో లభిస్తాయి.కానీ ఆవాలతో మీకు తెలియని సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

మరి ఆవాలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Mud Seeds, Skin, Telugu-Telugu Health

ఆవాలలో డైటరీ ఫాట్స్ కార్బోహైడ్రేట్స్ ఫాట్ బటాకేరోటిన్ విటమిన్ A,బి1 నుంచి బి6 వరకు అధిక మోతాదులో ఉంటాయి.పోషక విలువలతో పాటు ఆవాలు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి.చల్లదనంతో కీళ్ళు బిగిసుకుపోయి నొప్పిని కలిగించిన సందర్భాలలో ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి.

ఇవి వాతాన్ని, నొప్పిని, వాపును నిరోధిస్తాయి.వీటిలో ఉండే పోషకాలు మనకు వ్యాధులు రాకుండా కాపాడి వ్యాధి నిరోధకతను పెంచుతాయి.

శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యలు( Digestive Problems ) ఉన్నవారు ఆవాలను తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.

Telugu Tips, Mud Seeds, Skin, Telugu-Telugu Health

ఆవాల్లో ఉండే కాపర్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియంలో హైబీపీని తగ్గించే గుణాలు ఉన్నాయి.ఫంగస్ ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు( Skin Infections ) ఉన్నవారు ఆవాలను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు.ఆవాలలో మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుంది.

ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.ఇది జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

అయితే ఆవాలను తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది.

వీటిలో ఉండే పదార్థం జీవక్రియను నియంత్రిస్తాయి.అందువల్ల వీటిని మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube