వేసవి కాలంలో( Summer ) శరీరం డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటుంది.కాబట్టి మీ శరీరానికి పుష్కలంగా నీరు( Water ) అందించాల్సి ఉంటుంది.
వేసవి వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ క్రింది పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి నీళ్లలో ( Coconut Water ) ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, క్యాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు.
అయితే పుచ్చకాయలో( Watermelon ) 92 శాతం నీరు ఉంటుంది.కాబట్టి వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.అలాగే కీర దోసలో( Cucumber ) 95% వరకు నీరు ఉంటుంది.కాబట్టి వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
అలాగే తియ్యగా ఉండే కర్బూజా పండ్లు తినడం వల్ల శరీరానికి లవణాలు అందుతాయి.అలాగే శరీరంలో నీటి శాతం కూడా పెరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే వేసవి తాపం కూడా తీరుతుంది.బొప్పాయి పండ్లలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి వీటిని తీసుకుంటే వేసవిలో వచ్చే రుగ్మతల నుండి దూరంగా ఉండవచ్చు.

ఇంకా చెప్పాలంటే స్ట్రాబెరీస్( Strawberries ) తింటుంటే కూడా రోజువారి శరీరానికి అవసరమైన నీరు అందుతుంది.ఫలితంగా వేసవిలో అలసినట్లు ఉండదు.వేసవిలో మ్యాంగో జ్యూస్( Mango Juice ) వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణశయానికి సహాయపడుతుంది.
అంతే కాకుండా కాలేయ ఆరోగ్యానికి కూడా అది చాలా మేలు చేస్తుంది.కాబట్టి వేసవి కాలంలో వేసవి తాపం నుండి తప్పించుకునేందుకు ఈ పండ్లను తప్పకుండా తినాలి.
కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ పండ్లను ఫ్రిజ్లో పెట్టి తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు అందవు.

పండ్లను ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన పండ్లలో ఉండే విటమిన్స్ అన్ని కూడా కరిగిపోతాయి.దీంతో పండ్లు తిన్న కూడా ఎలాంటి మంచి ప్రభావం ఉండవు.ఫలితంగా దీని వలన దుష్ప్రభావాలు కలుగుతాయి.
అంతే కాకుండా పండ్లను ఈ విధంగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.కాబట్టి వేసవి కాలంలో మరి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం.
కాబట్టి వేసవి కాలంలో ఈ పండ్లను తినడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.