ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న చర్మ సమస్యల్లో ముడతలు ఒకటి.వయసు పైబడిన వారిలో ముడతలు కనిపించడం సర్వ సాధారణం.
కానీ, ఇప్పుడున్న కాలంలో ముప్పై ఏళ్ల వారిని సైతం ముడతలు కలవర పెడుతున్నాయి.కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, పెయిన్ కిల్లర్స్‌ను తరచూ తీసుకోవడం, రసాయనాలు అధికంగా ఉండే చర్మ ఉత్పత్తులను వాడటం, శరీర బరువులో వచ్చే మార్పులు, మేకప్‌ను పూర్తిగా తొలగించకపోవడం, ఎండల్లో అధికంగా తిరగడం వంటి రకరకాల కారణాల వల్ల ముడతలు ఏర్పడి.
అసహ్యంగా కనిపిస్తుంటాయి.
దాంతో ఆ ముడతలను నివారించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్‌ను వాడితే చాలా సులభంగా మరియు వేగంగా ముడతలను మాయం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక చిన్న కీరదోసను తీసుకుని సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్ జార్‌లో కీరదోస స్లైసెస్, రెండు టేబుల్ స్పూన్ల ఫ్లెక్స్‌సీడ్స్ పౌడర్, ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఒక రోజు పాటు పక్కన పెట్టేయాలి.ఆ తర్వాత ఆ గ్లాస్ జార్‌ను మరుగుతున్న నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచి.
ఆపై ఆయిల్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఈ ఆయిల్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు వాడుకోవచ్చు.ఈనూనెను ముఖంపై అప్లై చేసుకుని సున్నితంగా ఓ పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ప్రతి రోజు స్నానం చేయడానికి గంట ముందు ఇలా చేస్తే ముడతలు క్రమంగా తగ్గిపోయి ముఖం అందంగా, యవ్వనంగా మారుతుంది.