అలా నిద్రిస్తే ముఖంపై ముడ‌త‌లు రావ‌డం ఖాయం..జాగ్ర‌త్త‌!

వ‌య‌సు ముదిరే కొద్దీ ఎవ్వ‌రికైనా ముడ‌త‌లు రావ‌డం చాలా కామ‌న్‌.కానీ, కొంద‌రు చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌ల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.

 If You Sleep Like That, You Will Definitely Get Wrinkles On Your Face! Face, Wri-TeluguStop.com

ముడ‌త‌లు అందాన్ని త‌గ్గిస్తాయి.వ‌య‌సును పెంచి చూపిస్తాయి.

అందుకే ముడ‌త‌లు అంటేనే అంద‌రూ తెగ భ‌యప‌డి పోతుంటారు.అయితే త‌క్కువ వ‌య‌సులోనే ముడ‌త‌లు రావ‌డానికి మ‌నం చేసే కొన్ని కొన్ని పొర‌పాట్లు కూడా కార‌ణాలు అవుతుంటాయి.

మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ పొర‌పాట్లు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

సాధారణంగా కొంద‌రు నిద్రించే స‌మ‌యంలో ప‌క్క‌కు లేదా బోర్లా ప‌డుకుంటారు.

అయితే పక్కకి తిరిగి ప‌డుకునేట‌ప్పుడు.ఎటు వైపు ఎక్కువ‌గా నిద్రిస్తారో అటు బుగ్గ మీద, ఆ వైపు గడ్డం మీద ముడ‌త‌లు, స‌న్న‌ని చార‌లు ప‌డ‌తాయి.

మ‌రియు బోర్లా తిరిగి నిద్రిస్తే నుదుటి మీదంతా ముడ‌త‌లు వ‌స్తాయి.అందు వ‌ల్ల‌నే ఎప్పుడూ వెల్లకిలా పడుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి.

అలాగే కొంద‌రు కాఫీ, టీల‌ను తెగ తాగేస్తారు.ఈ అల‌వాటు ముడ‌త‌లు త్వ‌ర‌గా రావ‌డానికి ఓ కారణంగా చెప్పుకోవ‌చ్చు.

కాబ‌ట్టి.కాఫీ, టీల‌ను ఎంత లిమిట్‌గా తీసుకుంటె మీ చ‌ర్మానికి మ‌రియు ఆరోగ్యానికి అంత మంచిది.

Telugu Tips, Face, Latest, Skin Care, Skin Care Tips, Wrinkles, Wrinkles Face-La

సన్ స్క్రీన్ వాడే అల‌వాటు చాలా అంటే చాలా మందికి ఉండ‌దు.అయితే సన్ స్క్రీన్ వాడ‌కుండా బ‌య‌ట‌కు వెళ్తే ఎండ‌ల ప్ర‌భావం చ‌ర్మంపై ప‌డి ముడ‌త‌లు త్వ‌ర‌గా వ‌చ్చేస్తాయి.సో.ఏ క్రీమ్ వాడినా వాడ‌క‌పోయినా స‌న్ స్క్రీన్‌ను కంపల్సరీగా యూజ్ చేయాలి.

కొంద‌రు తెలిసో, తెలియ‌కో త‌ర‌చూ ఫేస్ వాష్ చేసుకుంటారు.కానీ, అతిగా ఫేష్ వాష్ చేసుకుంటే చ‌ర్మంపై ఉండే న్యాచుర‌ల్ ఆయిల్స్ తొల‌గిపోయి.చ‌ర్మంపై ముడ‌త‌లు వ‌స్తాయి.అందుకే రోజుకు మూడు సార్ల‌కు మించి ఫేస్ వాష్ చేసుకోరాదు.

ఇక డైట్‌లో ఏ ఫుడ్స్ ప‌డితే ఆ ఫుడ్స్ కాకుండా.తాజా పండ్లు, కూర‌గాయ‌లు, న‌ట్స్‌, డ్రై ఫ్రూట్‌, పాల ఉత్ప‌త్తులు, ఆకుకూర‌లు, తృణ‌ధాన్యాలు వంటివి ఉండేలా చూసుకోవాలి.

అప్పుడే ముడ‌త‌ల స‌మ‌స్య‌కు దూరంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube