కొత్తపేట ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవిన్యూ డివిజన్ ను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వై.యస్.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విషయం అందరికీ విదితమే.తదుపరి అధికారుల తప్పిదం వలన ఆఫీసియల్ గెజిట్ లో రాకపోవడంతో కొత్తపేట ప్రజలు కొంత ఆందోళనకు గురైన విషయం విదితమే.
ఈ విషయమై ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన విజయవాడ వెళ్ళి జరిగిన తప్పిదాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది.అనంతరం గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పులివెందుల సహా కొత్తపేట రెండు రెవిన్యూ డివిజన్లకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి తెలియచేశారు.కొత్తపేట ప్రజల చిరకాల కోరికను గుర్తించి ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే తప్పరని మరొకసారి నిరూపిస్తూ అధికారుల తప్పిదాన్ని సరిచేయించి నూతన రెవెన్యూ డివిజన్ గా కొత్తపేటను ప్రకటించినందుకు ఈరోజు కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ నందు జరిగిన కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేశారు.
కొత్తపేట రెవిన్యూ డివిజన్ సాధించడం వలన శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డికి మంచి పేరు వచ్చేస్తుంది అని ఆందోళన చెంది, తదుపరి చేజారిపోయిందని సంబరపడుతూ ఉనికి చాటుకోడానికి ఆందోళనలు చేసిన ప్రతిపక్షాల వారికి, అలాగే తిరిగి సాధించినందుకు అభినందించిన వారికి ప్రభుత్వ విప్ చిర్ల కృతజ్ఞతలు తెలియచేసి, కొత్తపేట ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.