సాధారణంగా మనం మన ఇంటిలో లేదా ఆలయాలలో పూజ చేయాలంటే ముందుగా దీపారాధనతోనే పూజను ప్రారంభం చేస్తాము.ఇది గత కొన్ని సంవత్సరాలుగా మన హిందూ ఆచార వ్యవహారాలలో భాగంగా వస్తున్న ఆనవాయితీ.
అయితే పూజ సమయంలో దీపం వెలిగించేటప్పుడు ఎంతో భక్తి భావంతో వెలిగించాలి.దీపం వెలుగుతూ మన జీవితంలో కమ్ముకున్న చీకటినీ పారద్రోలుతుందని హిందువులు విశ్వసిస్తారు.
అదేవిధంగా దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉందని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.
ఈ క్రమంలోనే దీపారాధన చేసే సమయంలో దీపానికి మూడు బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కరించాలి.
ఈ విధంగా దీపానికి ఎందుకు నమస్కారం చేయాలి అంటే దీపం పీఠభాగం బ్రహ్మతో సమానం, అదేవిధంగా దీపం కాడ విష్ణువు, దీపపు ప్రమిద పరమేశ్వరుడు. దీప తైలం నాదం వత్తి అగ్నిదేవుడుగా భావిస్తారు.
ఈ విధంగా సృష్టి మొత్తం శక్తి నుంచి ఏర్పడినప్పుడు పంచభూతాల అన్ని ఆ తల్లి స్వరూపమే.ఈ విధంగా మనం వెలిగించే దీపం లో వెలిగే అగ్ని సాక్షాత్తు అమ్మవారి రూపమేనని భావిస్తారు.
ఈ విధంగా అగ్ని రూపంలో అమ్మవారిని భావించి దీపాన్ని దర్శనం చేసుకోవాలి.ఈ దీపం అమ్మవారి ప్రతిరూపం అని భావించి చేసే మండల దీక్షకు కూడా అంతే ఫలితం ఉంటుంది.

ఎంతో శక్తివంతమైన ఇటువంటి దీపాన్ని సూర్యోదయానికి కంటే ముందుగా ఎక్కడైతే వెలిగిస్తారో అక్కడ సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని భావిస్తారు.ఈ విధంగా దీపానికి ఒక్కో సమయంలో ఒక్కో దేవత ఆది దేవతలుగా ఉంటారు.ఉదయం 5 గంటలకు వెలిగించే దీపానికి అధిపతిగా వినాయకుడు ఉంటాడు.అదేవిధంగా 5.30 నుండి 6 గం సమయం వరకు లక్ష్మీ దేవి అధిపతిగా ఉంటుంది.లక్ష్మీదేవి దీపం లో కొలువై ఉండి నారాయణుడిని ప్రార్థిస్తుంది.
ఈ విధంగా సూర్యోదయానికి ముందుగా ఎవరైతే దీపారాధన చేస్తారో వారి ఇంటిలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.