సాధారణంగా టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ కంపల్సరీగా ఉంటుంది.సినిమాకి గ్లామర్ టచ్ ఇవ్వడానికి బాగా క్రేజ్ ఉన్న, అందంగా ఉన్న హీరోయిన్లను మన వాళ్లు తీసుకుంటారు.
కొన్ని సినిమాలు హీరోయిన్ రోల్ వల్లే హిట్ అవుతుంటాయి.మగధీర, బాహుబలి, పుష్ప, రంగస్థలం లాంటి సినిమాల్లో హీరోయిన్లకు మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ కూడా దొరుకుతుంటాయి.
హీరోయిన్ ఉంటేనే సినిమాకి అందం అని కూడా అనుకుంటారు.అయితే కొన్ని సినిమాలు అసలు హీరోయిన్ అనే వారే లేకుండా తెరకెక్కి షాకిచ్చాయి.మరి ఆ సినిమాలేవో తెలుసుకుందాం పదండి.
• గాడ్ ఫాదర్:
( godfather )
గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు.ఇందులో నయనతార నటించిన కానీ ఆమె సిస్టర్ రోల్ చేసింది.ఇది ఒక సైడ్ క్యారెక్టర్ మాత్రమే అవుతుంది.మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ మలయాళ చిత్రం లూసిఫర్ (2019)కి రీమేక్.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.
ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో బాగానే కలెక్షన్లు రాబట్టింది కానీ చివరికి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

• పోలీస్ స్టోరీ
( Police story )
సాయికుమార్ లీడ్ రోల్ చేసిన “పోలీస్ స్టోరీ” సూపర్‌హిట్ అయింది.అంతేకాదు ఇది కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.ఈ మూవీలో అగ్నిగా సాయికుమార్ చూపించిన యాక్టింగ్‌కు ఇతర స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయారు.
అయితే ఈ యాక్షన్ ఫిలిం హీరోయిన్ లేకుండానే వచ్చింది.

• జై భీమ్
( Jai Bheem )
ఈ సినిమాలో హీరోగా సూర్య నటించాడు.ఈ లీగల్ డ్రామాలో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు.నటి లిజోమోల్ జోస్ ఇరుల తెగకు చెందిన సెంగెనిగా నటించింది.
ఇది ఒక క్యారెక్టర్ రోల్ మాత్రమే.హీరోయిన్ లేకపోయినా ఈ మూవీ సక్సెస్ అయ్యింది.

• జఫ్ఫా మూవీ
( Jaffa Movie )
వెన్నెల కిషోర్( Vennela Kishore ) డైరెక్ట్ చేసిన బ్లాక్ కామెడీ చిత్రం జఫ్ఫా (2013)లోనూ హీరోయిన్ ఉండదు.కమెడియన్ బ్రహ్మానందం ఇందులో హీరోగా నటించాడు.విశేషమేంటంటే, ఈ సినిమాలో ఏ స్టార్ యాక్ట్రెస్ కూడా నటించలేదు.ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
• గగనం
( Gaganam )
రాధాకృష్ణ( Radhakrishna ) డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ గగనంలో హీరోయిన్ ఉండదు.ఫ్లైట్ హైజాకింగ్ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనమ్ కౌర్, సనా ఖాన్, రిషి, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు.

• ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
( Agent Sai Srinivasa Atreya )
ఈ కామెడీ మిస్టరీ సినిమాలో కూడా హీరోయిన్ లేదని చెప్పుకోవచ్చు.శృతి శర్మ( Shruti Sharma ) ఇందులో ఒక ఫిమేల్ లీడ్ గా కనిపిస్తుంది కానీ ఆమె సినిమా చివరి వరకు ఉండదు.కొన్ని సీన్లలో ఒక అసిస్టెంట్‌గా మాత్రమే మెరుస్తుంది.