సాధారణంగా కొందరి బాడీ మొత్తం తెల్లగా ఉన్న కానీ.చేతులు మాత్రం నల్లగా, నిర్జీవంగా ఉంటాయి.
డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఎండల ప్రభావం, ప్రెగ్నెన్సీ తదితర కారణాల వల్ల చేతులు నల్లగా మారుతుంటాయి.దాంతో బయటకు వెళ్ళినప్పుడు చేతులను కవర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
ఈ క్రమంలోనే చేతుల నలుపును వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే ఒక్క దెబ్బతో నల్లగా మారిన చేతులను తెల్లగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా రబ్ చేసుకోవాలి.అపై వాటర్ తో శుభ్రంగా చేతులను కడగాలి.
ఆ తర్వాత మరో బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్లు టమాటో పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకుని అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు చేతులకు అప్లై చేసుకుని.పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నిమ్మ చెక్కలతో సున్నితంగా చర్మాన్ని రుద్దుతూ వాటర్ తో శుభ్రంగా చేతులను క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోయి చేతులు తెల్లగా మరియు మృదువుగా మారతాయి.