ఇటీవల అధిక బరువు సమస్యతో సతమతం అవుతున్న వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతోంది.అయితే అందరూ ఒకే కారణం వల్ల బరువు పెరగరు.
ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత వెయిట్ గెయిన్ అవుతుంటారు.కారణం ఏదైనప్పటికీ బరువు తగ్గటమే అందరి లక్ష్యం.
ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకవేళ మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవాల్సిందే.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు దాన్ని తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటీ.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్రీన్ ఆపిల్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును తీసుకుని వాటర్‌లో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ గా కట్ చేయాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, లెమన్ స్లైసెస్, ఆఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి పది నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేస్తే మన వెయిట్ లాస్ డ్రింక్ సిద్ధం అయినట్టే.