హెయిర్ ఫాల్ అనేది ఇటీవల దాదాపు అందరినీ మదన పెడుతూనే ఉంటుంది.అయితే ఒక్కొక్కరికి ఒక్కో కారణం చేత హెయిర్ ఫాల్ సమస్య ఏర్పడుతుంది.
కారణం ఏదైనా హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పొడిని రోజూ తీసుకుంటే హెయిర్ ఫాల్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.
మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు ఏ విధంగా తీసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు రెండు కప్పులు కరివేపాకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తడి పూర్తిగా పోయే వరకు ఆరబెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై వేయించుకోవాలి.
ఆ తర్వాత అందులో ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకు మరియు మెంతులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మెంతుల కరివేపాకు పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ పొడి జుట్టు రాలడాన్ని అరికట్టడమే కాదు మరెన్నో ప్రయోజనాలను కూడా అందిస్తుంది.ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఈ పొడిని కలిపి ఉదయాన్నే సేవించాలి.
ప్రతిరోజు ఈ పొడిని తీసుకుంటే హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.
జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరుగుతుంది.అలాగే ఈ పొడిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.మరియు ఆకర్షణీయమైన చర్మం మీ సొంతం అవుతుంది.







