మన దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు ఎంతో ఘనంగా ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు.ఈ పండుగ సందర్భంగా వేరే ప్రాంతాలకు వెళ్లి జీవిస్తున్న వారు కూడా తమ సొంత గ్రామాలకు చేరుకుంటారు.
ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి.
సంక్రాంతి పండుగకు ఎన్నో రకాల పిండి వంటకాలను తయారు చేస్తారు.
కోళ్ల పందాలు హరిదాసు గంగిరెద్దులు భోగిమంటలు లాంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటారు.
సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబంతో చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు.కానీ వ్యాపారంలో ఏవైనా సమస్యలు ఉంటే సంక్రాంతి పండుగ రోజు ఈ చిన్న పని చేస్తే ఆ సమస్యలు వెంటనే దూరం అవుతాయి.
ఈ సమస్య పరిష్కారానికి ఒక రాగి నాణెం అవసరమవుతుంది.
ఆ రాగి నాణెం తో ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.సంక్రాంతి పండుగ రోజున ఉదయం తన స్నానం చేసి దేవుని ప్రార్థించి ఒక రాగి నాణేన్ని తీసుకొని మీ ఇంట్లో గానీ, వ్యాపారంలో గాని, ఆఫీసులలో కానీ డబ్బులు పెట్టే ప్రదేశంలో ఆ రాగి నాణెం తో మూడుసార్లు దిష్టి తీసి ఆ నాణేన్ని ఎర్రటి వస్త్రంలో పెట్టి మూట కట్టాలి.
ఈ మూటను దేవుడి దగ్గర పెట్టి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి సమస్యలు లేకుండా చూడమని భగవంతున్ని ప్రార్ధన చేయడం మంచిది.ఇంకా చెప్పాలంటే సాయంత్రం సమయంలో ఆ మూటను నదిలో నిమర్జనం చేయడం ఎంతో మంచిది.సంక్రాంతి రోజు ఇలా చేస్తే ఆర్థికపరమైన సమస్యలు కష్టాలు కచ్చితంగా దూరమవుతాయి.