ట్రంప్ వెళుతూ.. వెళుతూ ఇండియాపై ఆంక్షలు విధిస్తారా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 15 రోజుల్లో మాజీ అయిపోతారు.వున్న కాస్త ఈ గడువులోనే అన్ని చక్కబెట్టుకుంటున్నారు ట్రంప్.

ఇప్పటికే వలసదారులకు గ్రీన్‌కార్డులు, హెచ్ 1 బీ వీసా దారులపై వున్న నిషేధాన్ని మార్చి వరకు పొడిగించిన ఆయన.పదవిలోంచి దిగుతూ భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రష్యా నుంచి భారత్ ఎస్ 400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు విషయంలో అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ డీల్ విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే ఇండియాపై ఆంక్షలు తప్పవని అమెరికా కాంగ్రెషనల్ రిపోర్ట్ హెచ్చరించింది.ఇది అధికారిక నివేదిక కాదు.డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన స్వతంత్ర సభ్యులు దీనిని తయారు చేస్తారు.

కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో సభ్యులకు సమాచారం అందించడం కోసం ఇలాంటి నివేదికలను వారు తయారు చేస్తుంటారు.రష్యా నుంచి భారత్ ఎస్ 400 రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడం అనేది.

Advertisement

కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్ యాక్ట్ కింద భారతదేశంపై ఆంక్షలకు కారణమవుతుందని ఆ నివేదిక తెలిపింది.భారత్ వివిధ దేశాలతో చేసుకునే రక్షణ ఒప్పందాలు సాంకేతికత బదిలీ, ఉమ్మడి ఉత్పత్తి వంటి విధానాలపై ఆధారపడుతున్నాయని వెల్లడించింది.

కానీ అమెరికా మాత్రం భారత్ రక్షణ ఒప్పందాల్లో సంస్కరణలు కోరుకుంటోందని తెలిపింది.

తొలి నుంచి అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా వున్న రష్యా నుంచి భారత్ ఎస్ 400 కొనుగోలు చేసేందుకు అక్టోబర్‌ 2018లో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ డీల్ విలువ 5 బిలియన్ డాలర్లు.దీనికి సంబంధించి 2019లో 800 మిలిన్ డాలర్లు కూడా చెల్లించింది.

అదే సమయంలో భారత్‌తో సన్నిహితంగా మెలుగుతున్న డొనాల్డ్ ట్రంప్ రష్యాతో డీల్‌ను రద్దు చేసుకోవాలని సూచించారు.దీనికి బదులుగా పేట్రియాట్, థాడ్ రక్షణ వ్యవస్థలను ఇస్తామని చెప్పారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కానీ భారత్ మాత్రం ఎస్ 400కే మొగ్గుచూపింది.ఇందుకు కారణం లేకపోలేదు.

Advertisement

ఎస్ 400 రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైదనని నిపుణులు చెబుతున్నారు.రాడార్, శత్రు విమానాలను స్వయంగా పసిగట్టి ఎదురుదాడి చేసే యంత్రాంగం, విమాన విధ్వంసక క్షిపణులు నియంత్రణ కేంద్రం ఎస్ 400లో అంతర్భాగాలు.

శత్రు విమానాలను, పైలట్ రహిత యూఏవీలను, క్షిపణులను ఎస్ 400 కూల్చివేయగలదు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా దీనిని సులభంగా తరలించవచ్చు.

త్రివిధ దళాలకు గగనతల రక్షణ వ్యవస్థగా వినియోగించవచ్చు.అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

కానీ వెళుతూ వెళుతూ ట్రంప్ ఈ ఆంక్షలను విధిస్తారా.లేక జో బైడెన్ లెక్క సరిచేస్తారోనని రక్షణ నిపుణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు