ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు రాణిస్తున్నారు.అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
ఎక్కువ శాతం మంది సినిమాలపై, నటనపై ఉన్న పిచ్చి ఫ్యాషన్ తోనే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.అలా నటీనటులుగా ఎదగడానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కారణం ఉంటుంది.
అలా తనకు కూడా ఒక కారణం ఉంది అంటుంది బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.( Kriti Sanon ) కాగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఇటీవలే క్రూ ( Crew ) తో ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో హీరోయిన్ కృతి సనన్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ కృతి సనన్.కాగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.బాలీవుడ్‌లో రాబ్తా( Raabta ) నాకు మూడో చిత్రం.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.అయినప్పటికీ ఆ చిత్రం పరాజయం పాలైందని నేనెప్పటికీ అనుకోను.
ఎందుకంటే ఆ సినిమా నాకెంతో నేర్పింది.
అందులోని పాత్ర కోసం చాలా సిద్ధమయ్యాను.సెట్‌లో కూడా చాలా నేర్చుకున్నాను.గుర్రపు స్వారీ, నీటిలో సన్నివేశాలు ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాను.
నటిగా ఎదగడానికి కారణమైన వాటిల్లో ఈ చిత్రం ఒకటి.నా మనసులో ఈ సినిమాకి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
ఎన్నో సంతోషకరమైన జ్ఞాపకాలను అందించిన చిత్రం ఇది అని తెలిపింది.